
మణిపూర్, జైపూర్‌లో భూకంపం.. భయంతో జనం పరుగులు
ఈ వార్తాకథనం ఏంటి
మణిపూర్ ఉక్రుల్ పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున భూమికంపించడంతో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు.
రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.5గా నమోదైంది. ఈ మేరకు నేషనల్ సిస్మాలజీ సెంటర్ ప్రకటించింది.
ఉదయం 5 గంటల సమయంలో 20 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం చోటుచేసుకున్నట్లు వెల్లడించింది.
అసలే అమానుష ఘటనలతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలతో హోరెత్తుతున్న క్రమంలో భూకంపాలు రావడం ప్రజలను ఉలిక్కిపడేలా చేస్తోంది.
మరోవైపు రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోనూ భూమి కంపించింది. ఉదయం 4 గంటల సమయంలో భూకంపం వచ్చిందని అక్కడి అధికారులు ప్రకటించారు.
DETAILS
ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు : అధికారులు
భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.4గా గుర్తించినట్లు నేషనల్ సిస్మాలజి సెంటర్ వెల్లడించింది. ప్రజలందరూ తెల్లవారుజామున గాఢ నిద్రలోకి జారుకోగా భూమి ఆకస్మికంగా కంపించింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని నివాసితులు భయాందోళనలకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో కొంతమంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వీధుల్లోకి పరుగు లంకించుకున్నారు. ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు ప్రకటించారు.
మరోవైపు రాజస్థాన్‌లోని జైపూర్ సహా ఇతర ప్రాంతాలలో భూకంపం వచ్చినట్లు ఆ రాష్ట్ర మాజీ సీఎం వసుంధర రాజే తెలిపారు.
ఈశాన్య రాష్ట్రం మిజోరాంలోని నొగొపా ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున రిక్టర్ స్కేల్‌పై 3.6 తీవ్రతతో భూమి కంపించినట్లు మిజోరాం అధికారులు వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో కంపించిన భూమి
Rajasthan | An earthquake of Magnitude 4.4 strikes Jaipur
— ANI (@ANI) July 20, 2023
(CCTV Visuals)
(Video source - locals) pic.twitter.com/MOudTvT8yF