LOADING...
మహిళల వివస్త్ర ఘటనపై మణిపూర్‌లో ప్రజాగ్రహం.. నిరసనలు, ర్యాలీలతో హోరెత్తుతోన్న ఈశాన్యం 
నిరసనలు, ర్యాలీలతో హోరెత్తుతోన్న ఈశాన్యం

మహిళల వివస్త్ర ఘటనపై మణిపూర్‌లో ప్రజాగ్రహం.. నిరసనలు, ర్యాలీలతో హోరెత్తుతోన్న ఈశాన్యం 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 20, 2023
05:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ఆ రాష్ట్రంలో నిరసన జ్వాలలు అంటుకున్నాయి. ఈ మేరకు గిరిజన మహిళలను వివస్త్రను చేయడాన్ని ఖండిస్తూ భారీ ర్యాలీని చేపట్టారు. మరోవైపు నిందితుల ఆచూకీ కనిపెట్టేందుకు సెర్చ్ ఆపరేషన్‌ చేపట్టామని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రకటించారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన అమానవీయ ఘటన దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ మేరకు చురచంద్‌పుర్‌ జిల్లాలో వేలాది ప్రజలు బ్లాక్ డ్రెస్ ధరించి నిరసన ప్రదర్శించారు. బాధిత మహిళలకు న్యాయం చేయాలని, నిందితులపై ఉక్కుపాదం మోపాలని పట్టుబట్టారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా స్థానికులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో కదం తొక్కారు.

DETAILS

వీడియో ఎలా బహిర్గతమైందో ఎంక్వైరీ చేయాలని సీఎం ఆదేశం

మే 4నే ఈ దారుణం జరిగినప్పటికీ దీనికి సంబంధించిన ఓ వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపింది. దీంతో వేగంగా ఈ వార్త దేశమంతటా వైరల్ అయ్యింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ పాలనపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఘటనపై ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతుందని, బాధ్యులకు ఉరి శిక్షలు విధిస్తామని స్పష్టం చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని ఉదయమే ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో మిగతా నిందితుల పరారీలో ఉన్నట్లు సమాచారం. వారి కోసం కూంబింగ్‌ ఆపరేషన్‌ జరుగుతోందన్నారు. ఈ వీడియో ఎవరి నుంచి సోషల్ మీడియాలోకి వచ్చిందో ఎంక్వైరీ చేయాలని సైబర్ క్రైమ్‌ పోలీసులను సీఎం ఆదేశించారు.