Page Loader
రాజ‌స్థాన్‌లో ఘోరం.. కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తగలబెట్టిన దుండగలు
కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తగలబెట్టిన దుండగలు.. జోధ్‌పూర్ సమీపంలో ఘోర హ‌త్య‌

రాజ‌స్థాన్‌లో ఘోరం.. కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తగలబెట్టిన దుండగలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 19, 2023
06:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజ‌స్థాన్‌లోని జోధ్‌పూర్ కు స‌మీప గ్రామంలో ఘోరం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు వ్యక్తులను దారుణంగా గొంతు కోసి అనంతరం ఆధారాలు దొరకకుండా దహనం చేశారు. ఈ ఘటనలో న‌లుగురు కాలి బూడిదైన విషాద సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మృతుల్లో ఓ ఆర్నెళ్ల చిన్నారి కూడా ఉండటం తీవ్ర విచారకరంగా మారింది. జోధ్‌పూర్ నగరానికి 50 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఓసియాన్ స‌మీపంలోని చౌరాయి గ్రామంలో ఈ అమానుషం జ‌రిగింది. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రకంపణలూ చెలరేగాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని ప్ర‌భుత్వ నిర్లక్ష్యాన్ని ప్ర‌తిప‌క్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ మేరకు ఆందోళ‌నలు వ్యక్తం చేశాయి.

DETAILS

వ్య‌క్తిగ‌త క‌క్షసాధింపు వ‌ల్లే ఈ హ‌త్య‌లు : పోలీసులు

సాక్షాత్తు రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్ సొంత జిల్లాలోనే ఈ ఘోరం వెలుగుచూడటం పట్ల ప్రతిపక్ష బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చౌరాయిలో గ‌త రాత్రి జరిగిన ఘ‌ట‌నలో పున‌ర‌మ్ (55) ఏళ్ల వ్య‌క్తి నివాసాన్ని కాల్చిబూడిద చేశారు. ఈ ఘ‌ట‌న‌లో పున‌ర‌మ్‌ సహా ఆయ‌న భార్య భ‌న్వ‌రి (50) కోడ‌లు దాపు (23), ఆమె కుమార్తె 6 ఏళ్ల పసిబాలిక అవశేషాలను పోలీసులు గుర్తించారు. ఆ శ‌రీరాలు మంట‌ల్లో పూర్తిగా కాలిపోయినట్లు నిర్దారించారు. ముందుగా గొంతులు కోసిన దుండగలు తర్వాత దహనానికి పాల్ప‌డిన‌ట్లు ప్రాథమిక విచారణలో తేల్చారు.వ్య‌క్తిగ‌త క‌క్షసాధింపు వ‌ల్లే ఈ హ‌త్య‌లు చోటు చేసుకుని ఉండొచ్చనే కోణంలో ఆరా తీస్తున్నారు. అన్ని కోణాల్లో ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.