LOADING...
Earthquake: భద్రాచలం, కొత్తగూడెంలో భూప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై 3.8 తీవ్రత నమోదు!
భద్రాచలం, కొత్తగూడెంలో భూప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై 3.8 తీవ్రత నమోదు!

Earthquake: భద్రాచలం, కొత్తగూడెంలో భూప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై 3.8 తీవ్రత నమోదు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 14, 2026
09:23 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించి ప్రజల్లో ఆందోళన కలిగించింది. జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, పాల్వంచ ప్రాంతాల్లో భూప్రకంపనలు నమోదయ్యాయి. ఆకస్మికంగా భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శనివారం అర్ధరాత్రి దాటిన అనంతరం తెల్లవారుజామున 2.26 గంటల సమయంలో ఈ ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.8గా నమోదైనట్లు తెలిపారు. తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ ప్రకంపనలు స్పష్టంగా అనిపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

వివరాలు

ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీసిన ప్రజలు

చాలామంది నిద్రలో ఉండగానే భూమి కంపించడాన్ని గమనించి భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొంతసేపు ఆయా ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం లేదని అధికారులు తెలిపారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, భూకంప ప్రభావంపై సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. తీవ్రత స్వల్పంగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పినా, భూప్రకంపనల కారణంగా స్థానికుల్లో కొంతసేపు భయాందోళనలు నెలకొన్నాయి.

Advertisement