సిక్కింలో భూకంపం, యుక్సోమ్‌లో 4.3 తీవ్రత నమోదు
సిక్కింలో భూకంపం, యుక్సోమ్‌లో 4.3 తీవ్రత నమోదు
వ్రాసిన వారు
Naveen Stalin
February 13, 2023 | 09:37 am
సిక్కింలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. సిక్కింలోని యుక్సోమ్ పట్టణంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలియజేసింది. యుక్సోమ్‌కు వాయువ్యంగా 70 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో ఉదయం 4.15 గంటలకు భూకంపం సంభవించినట్లు వెల్లడించింది. అయితే భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి, నష్టం జరగలేదని అధికారులు చెప్పారు.