
జమ్మూ కాశ్మీర్‌లోని కత్రాలో తెల్లవారుజామున భూకంపం
ఈ వార్తాకథనం ఏంటి
జమ్మూకాశ్మీర్‌లోని కత్రాలో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. కత్రాకు తూర్పున 97 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 3.6గా నమోదైందని నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఉదయం 5.01 గంటలకు 10 కి.మీ లోతులో భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది.
17-02-2022న 3.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని, జమ్మూ కాశ్మీర్ లోని కత్రాలో 10 కిలో మీటర్ల లోతులో ఉదయం 05:01:49 గంటలకు ఈ పరిణామం చోటు చేసుకుందని ఎన్ సీఎస్ ఓ ట్వీట్ లో పేర్కొంది.
ఎక్కడా ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలియజేశారు.
సిక్కీం
తరుచూ భూకంపాలు
అంతకుముందు ఫిబ్రవరి 13 న, సిక్కిం రాష్ట్రంలో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. సిక్కింలోని యుక్సోమ్‌లో తెల్లవారుజామున 4.15 గంటలకు భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదైంది.
అయితే ఆదివారం మధ్యాహ్నం అస్సాంలోని నాగోన్‌లో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. అది చోటు చేసుకున్న ఒక రోజు తర్వాత ఈ భూకంపం రావడం గమనార్హం. దాని కంటే ఒక రోజు ముందు, గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో 3.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి.