LOADING...
Earth Tremors: హైదరాబాద్‌లో భూ ప్రకంపనలు.. భయంతో బయటికి పరుగులు తీసిన ప్రజలు
హైదరాబాద్‌లో భూ ప్రకంపనలు.. భయంతో బయటికి పరుగులు తీసిన ప్రజలు

Earth Tremors: హైదరాబాద్‌లో భూ ప్రకంపనలు.. భయంతో బయటికి పరుగులు తీసిన ప్రజలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 10, 2026
05:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా గాజుల రామారంలోని మెట్ కాన్ గూడ, దేవేందర్ నగర్, కైసర్ నగర్, జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఈ ఉదయం స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. స్థానికులు కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్లు చెప్పిన ఈ ఘటన పక్క పొరుగువారిలో భయాందోళన రేకెత్తించింది. గాజుల రామార్‌లోని మెట్ కాన్ గూడ నివాసితులు భూకంపాన్ని అనుభవించిన సందర్భంలో, ఇంట్లోని వస్తువులు కదిలిపోయి, పెద్ద శబ్దంతో భూమి ఉలిక్కిపడినట్లు తెలిపారు. కొందరు పెద్ద శబ్దం వినిపించిన వెంటనే భయంతో బయటకు పరుగులు తీశారని చెబుతున్నారు. అయితే, ఇది భూకంపమేనా లేదా ఇతర పేలుళ్ల కారణమా అనే అంశంపై స్పష్టత ఇంకా రాలేదు.

Details

10:10 గంటల ప్రాంతంలో భూప్రకంపనలు

మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్ సర్కిల్, గాజులరామారం డివిజన్‌లలో ఈ ఉదయం 10:10 గంటల ప్రాంతంలో భూప్రకంపనలు నమోదయ్యాయని స్థానికులు వెల్లడించారు. పలు గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్‌లలోని నివాసితులు భయంతో బయటకు పరుగులు తీశారని తెలిపారు. సమీప పాఠశాలలు ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని ముందుగానే సెలవులు ప్రకటించాయి. స్థానిక అధికారులు మెట్ కాన్ గూడకు చేరుకొని పరిశీలన ప్రారంభించారు. భూప్రకంపనలకు కారణం ఏమిటి, భూకంపమా లేక పేలుడు సంభవించిందా అనే అంశాలను పరిశీలిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల నివాసితులు భయాన్ని వ్యక్తం చేస్తూ, అధికారుల నుండి త్వరిత సమాచారం కోసం వేచి చూస్తున్నారు.

Advertisement