earthquake: ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు.. భయంతో ప్రజలు బయటికి!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 21, 2024
11:19 am
ఈ వార్తాకథనం ఏంటి
ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, ముండ్లమూరు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడులో భూమి కంపించింది. ఈ ప్రకంపనలతో ముండ్లమూరు పాఠశాల వద్ద విద్యార్థులు భయంతో బయటకి పరుగులు తీశారు. ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగులు కూడా భయపడి బయటకొచ్చారు. అదే సమయంలో తాళ్లూరు మండలంలో కూడా స్వల్ప భూ ప్రకంపనలు నమోదయ్యాయి. తాళ్లూరు, గంగవరం, రామభద్రాపురం తదితర గ్రామాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించినట్లు సమాచారం.