LOADING...
Tamil Nadu: తమిళనాడులో ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు.. ఎన్నికల సంఘం కీలక ఏర్పాట్లు
తమిళనాడులో ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు.. ఎన్నికల సంఘం కీలక ఏర్పాట్లు

Tamil Nadu: తమిళనాడులో ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు.. ఎన్నికల సంఘం కీలక ఏర్పాట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2026
09:41 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులో ఉప ఎన్నికల రాజకీయ వేడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీ) సన్నాహాలను వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి సహా పలువురు ఎమ్మెల్యేల రాజీనామాలతో ఈ స్థానాలు ఖాళీ కావడంతో ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధమవుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ నియోజకవర్గాల నుంచి విజయం సాధించిన విజయ్.. ఎన్నికల నిబంధనల మేరకు తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ నియోజకవర్గం ఖాళీగా మారింది.

వివరాలు 

అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామాలతో మరో నాలుగు చోట్ల ఖాళీలు

మరోవైపు, టీవీకే ప్రభుత్వానికి జరిగిన విశ్వాస పరీక్షలో మద్దతు తెలిపిన అన్నాడీఎంకేకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఎస్.జయకుమార్ (పెరందురై),మరగతం కుమరవేల్ (మధురాంతకం),పి. సత్యభామ (ధారపురం),ఇసక్కీ సుబ్బయ్య (అంబసముద్రం)తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి అధికార పార్టీలో చేరారు. దీంతో మొత్తం ఐదు అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఉప ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు ప్రారంభించింది. జూన్ 22లోపు అన్ని సన్నాహక పనులను పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఐదు నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులు,అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను కూడా నియమించింది. పరిపాలనా,లాజిస్టిక్స్ అంశాలపై సమీక్ష అనంతరం రానున్న వారాల్లో ఉప ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement