LOADING...
 Election Commission: పార్టీలపై ఈసీ ఎలాంటి వివక్ష చూపదు: సీఈసీ 
పార్టీలపై ఈసీ ఎలాంటి వివక్ష చూపదు: సీఈసీ

 Election Commission: పార్టీలపై ఈసీ ఎలాంటి వివక్ష చూపదు: సీఈసీ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 17, 2025
04:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎన్నికల సంఘానికి (Election Commission) ఎలాంటి భేదభావాలు ఉండవని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలను సమానంగా చూస్తుందని, కొన్ని వ్యక్తులు 'ఓటు చోరీ' పేరుతో అనవసర అనుమానాలను లేవనెత్తుతున్నారని ఆయన ఆక్షేపించారు. బిహార్‌లో ఓటరు జాబితా సమగ్ర సవరణ (Special Intensive Revision)పై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణల నేపథ్యంలో మీడియాతో సీఈసీ సమావేశం నిర్వహించారు. రాజ్యాంగ సంస్థలను అవమానించడం సరికాదన్నారు. ఓటరు జాబితా ప్రతీ పార్టీకి బూత్‌ లెవల్‌ వద్ద అందుబాటులో ఉంటుందని, ప్రతి పార్టీ ఆ జాబితాను స్వతంత్రంగా పరిశీలించగలదని స్పష్టం చేశారు. సంస్కరణల ప్రక్రియలో భాగంగానే ఓటరు జాబితాను సవరిస్తున్నట్లు సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ అన్నారు.