తదుపరి వార్తా కథనం

ECI: అసత్య సమాచార వ్యాప్తికి కొత్త వెబ్ సైట్ తో చెక్
వ్రాసిన వారు
Stalin
Apr 03, 2024
05:57 pm
ఈ వార్తాకథనం ఏంటి
లోక్‌సభ ఎన్నికల్లో అసత్య సమాచార వ్యాప్తిని అరికట్టడానికి ఎన్నికల కమిషన్ 'మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్' పేరుతో ఓ వెబ్ సైట్ ను రూపొందించింది.
దీనిని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్,సుఖ్బీర్ సింగ్ సంధు ,ప్రారంభించారు.
అసత్య కథనాల వ్యాప్తిని అడ్డుకొని ఎన్నికల సమయంలో ప్రజలకు కచ్చితమైన సమాచారం అందించే దిశగా దీనిని రూపొందించినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఎన్నికల సంఘం చేసిన ట్వీట్
Myth vs Reality Register: Your one-stop platform for credible and authenticated election-related information. #VerifyBeforeYouAmplify #ECI
— Election Commission of India (@ECISVEEP) April 2, 2024
Visit this link:👉 https://t.co/4wX1CB9UpH #LokSabhaElections2024 pic.twitter.com/TfnCFAWsbb