తదుపరి వార్తా కథనం
ECI: కట్టు బాట్లు దాటొద్దు :కాంగ్రెస్,బీజేపీలకు ఈసి లేఖ
వ్రాసిన వారు
Stalin
May 22, 2024
06:04 pm
ఈ వార్తాకథనం ఏంటి
స్టార్ క్యాంపెయినర్లందరూ ప్రవర్తనా నిమావళిని ఖచ్చితంగా పాటించాలని ఎన్నికల సంఘం(ఈసి) ఆదేశించింది.
ఏ పార్టీ అభ్యర్థి అయినా కులాలు, వర్గాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రకటనలు చేయరాదని హెచ్చరించింది.
ఈ మేరకు కాంగ్రెస్ ,బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గే లకు లేఖ రాసింది. ప్రచారకర్తలు సంయమనం పాటించాలని కోరింది.సమాజంలో ఇప్పటికే ఉన్న విభేదాలను తీవ్రతరం చేయరాదని కోరింది.
పరస్పర ద్వేషాన్ని సృష్టించే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని సూచించింది.కులాలు, వర్గాలు, మతాలు మధ్య ఉద్రిక్తతలకు కారణమయ్యే కార్యకలాపాలలో పాల్గొనకూడదని పేర్కొంది.
పోలింగ్ చివరి దశకు చేరుకుంటున్న వేళ ఇసి ఈ తరహాలో హెచ్చరించటం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశ గౌరవానికి భంగం కలగని రీతిలో ప్రచారం చేసుకోవాలని సూచించింది.