LOADING...
Sujit Bose: మున్సిపల్‌ నియామకాల కుంభకోణం కేసులో బెంగాల్‌ మాజీ మంత్రి సుజిత్ బోస్‌ అరెస్టు
బెంగాల్‌ మాజీ మంత్రి అరెస్టు

Sujit Bose: మున్సిపల్‌ నియామకాల కుంభకోణం కేసులో బెంగాల్‌ మాజీ మంత్రి సుజిత్ బోస్‌ అరెస్టు

వ్రాసిన వారు Sirish Praharaju
May 11, 2026
10:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌లో అధికారాన్ని కోల్పోయిన తృణమూల్‌ కాంగ్రెస్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి సుజిత్‌ బోస్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. మున్సిపల్‌ నియామకాల కుంభకోణం కేసులో దాదాపు ఏడు గంటలపాటు విచారణ నిర్వహించిన అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వంలో సుజిత్‌ బోస్ అగ్నిమాపక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ కేసులో ఆయన కుమారుడు సముద్రకు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది.

వివరాలు 

టీఎంసీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు 

బెంగాల్‌లో అధికార మార్పిడి జరిగిన తర్వాత తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన కీలక నాయకుడు అరెస్టు కావడం ఇదే తొలిసారి కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలను భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రచార అంశంగా మలుచుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఎన్నికల ప్రచారంలో టీఎంసీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలను పదేపదే ప్రస్తావించారు. ఈ అంశాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లడం ద్వారా భాజపా ఎన్నికల్లో ఘన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement