LOADING...
ED: పీఎన్‌బీ స్కామ్‌ కేసులో ఛోక్సీ కుమారుడిపై ఈడీ ఆరోపణలు
పీఎన్‌బీ స్కామ్‌ కేసులో ఛోక్సీ కుమారుడిపై ఈడీ ఆరోపణలు

ED: పీఎన్‌బీ స్కామ్‌ కేసులో ఛోక్సీ కుమారుడిపై ఈడీ ఆరోపణలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 16, 2026
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్ కు వేల కోట్ల రూపాయల మోసం చేసి దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరగాడు మెహుల్‌ ఛోక్సీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) దర్యాప్తు కొనసాగుతోంది. ఎనిమిదేళ్లుగా సాగుతున్న ఈ మనీలాండరింగ్‌ విచారణలో తాజాగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మెహుల్‌ ఛోక్సీ కుమారుడు రోహన్‌ ఛోక్సీకి కూడా ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ వివరాలను దిల్లీలోని అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌కు తాజాగా సమర్పించారు. ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. మెహుల్‌ ఛోక్సీ డైరెక్టర్‌గా వ్యవహరించిన 'లస్టర్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌' కంపెనీలో రోహన్‌ ఛోక్సీకి 99.99 శాతం వాటా ఉంది.

Details

నిధులను విదేశాలను మళ్లించినట్లు నిర్ధారణ

ఈ సంస్థను ఉపయోగించి భారీ మొత్తంలో నిధులను విదేశాలకు మళ్లించినట్లు దర్యాప్తులో తేలింది. నగదు అక్రమ చలామణి వ్యవహారంలో రోహన్‌ ఛోక్సీ చురుకుగా పాల్గొన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అతడి ఆస్తులను అటాచ్‌ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. అలాగే, రోహన్‌తో పాటు ఛోక్సీ కుటుంబానికి చెందిన ఇతర సభ్యులను కూడా విచారణకు పిలిపించే చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.

Details

దేశం వదిలి పారిపోయిన ప్రధాన నిందితుడు

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నుంచి దాదాపు రూ.13 వేల కోట్ల రుణాలను మోసం చేసిన మెహుల్‌ ఛోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్‌ మోదీ (ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు) దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ఛోక్సీ ఆంటిగ్వా-బార్బుడాకు వెళ్లగా.. నీరవ్‌ మోదీ లండన్‌లో తలదాచుకున్నాడు. ప్రస్తుతం నీరవ్‌ మోదీ లండన్‌లోని జైలులో ఉన్నాడు. ఈ ఇద్దరినీ భారత్‌కు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం, విదేశాంగ శాఖ సంబంధిత దేశాల అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి.

Advertisement