టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసాల్లో ఈడీ సోదాలు
ఈ వార్తాకథనం ఏంటి
గుంటూరు జిల్లా , హైదరాబాద్‌లోని టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఈడీ అధికారులు మంగళవారం తెల్లవారుజాము నుంచి 10 మంది అధికారుల బృందం రాయపాటి ఇళ్లలో తనిఖీలు చేస్తోంది.
రూ.10,000 కోట్ల బ్యాంకు రుణం మోసం చేసిన కేసులో భాగంగా ఈడీ ఈ దాడులు చేస్తోంది.
దీంతో హైదరాబాద్‌లోని మలినేని సాంబశివరావు నివాసంతో పాటు ఆయన కంపెనీలపై కూడా దాడులు కొనసాగుతున్నాయి.
ఈడీ
యూనియన్ బ్యాంక్ మోసం చేసినట్లు ఈడీ అభియోగాలు
బ్యాంకు మోసాలకు సంబంధించి పీఎంఎల్‌ఏ కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పుప్పాలగూడ, మాదాపూర్, గుంటూరులో 15 వేర్వేరు ప్రాంతాల్లో సోదా చేస్తున్నారు.
ట్రాన్స్‌స్ట్రాయ్ ఇండియా (లిమిటెడ్) ప్రమోటర్‌గా ఉన్న రాయపాటి సాంబశివరావు రూ.10,000 కోట్ల రుణం తీసుకుని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మోసగించినట్లు ఈడీ ఆరోపిస్తోంది.
ఈ మొత్తాన్ని ఆయన సమీప బంధువు మలినేని సాంబశివరావుకు చెందిన కంపెనీలకు మళ్లించినట్లు ఈడీ అభియోగాలు మోపింది.
మలినేని సాంబశివ రావు ట్రాన్స్‌స్ట్రాయ్ పవర్ ప్రాజెక్ట్స్, టెక్నో యూనిక్ ఇన్‌ఫ్రా-టెక్ ప్రైవేట్ లిమిటెడ్, కాకతీయ క్రిస్టల్ పవర్ (ఇండియా) లిమిటెడ్‌లకు డైరెక్టర్‌గా ఉన్నారు.