Page Loader
Ranyarao: రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు.. హోం మంత్రి పరమేశ్వరకు చెందిన విద్యాసంస్థలపై ఈడీ దాడులు 
రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు..

Ranyarao: రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు.. హోం మంత్రి పరమేశ్వరకు చెందిన విద్యాసంస్థలపై ఈడీ దాడులు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 21, 2025
12:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావుకు ప్రత్యేక న్యాయస్థానం కొన్ని ప్రత్యేక షరతులతో బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈకేసు నేపథ్యంలో తాజాగా మరొక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తాజాగా వెలుగులోకి వచ్చిన అంశాల ప్రకారం,కర్ణాటక హోంశాఖ మంత్రి జి. పరమేశ్వరకు సంబంధం ఉన్న శ్రీ సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే వైద్య కళాశాలపై బుధవారం రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED)అధికారులు సోదాలు నిర్వహించారు. ఈకళాశాలకు జి. పరమేశ్వర ఛైర్మన్‌గా ఉన్నారు.రన్యారావు అక్రమ బంగారం రవాణా వ్యవహారంలో ఆమెకు,ఈ కళాశాల మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని,అందుకే ఈ ఆర్థిక సంబంధాలను వెల్లడించేందుకు కళాశాల ఆర్థిక పత్రాలను పరిశీలిస్తున్నామని ఈడీ అధికారులు తెలిపారు.

వివరాలు 

4.7 కిలోల బంగారం స్వాధీనం

రన్యారావు స్మగ్లింగ్ కేసులో రాజకీయ మద్దతు ఉందన్న అనుమానంతో ఇటీవల జరిగిన ఆమె వివాహ వేడుకకు హాజరైన ప్రముఖుల వివరాలు, వారు ఇచ్చిన కానుకలు మొదలైన అంశాలపై విచారణ కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఆమె వివాహ ఫొటోల్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు హోంమంత్రి పరమేశ్వర కూడా కనిపించడం విచారణను మరింత ఆసక్తికరంగా మార్చింది. ఇదే కారణంగా హోంమంత్రికి అనుబంధంగా ఉన్న కళాశాలపై ఈడీ తనిఖీలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. రన్యారావు కొద్ది రోజుల క్రితం దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకువస్తుండగా బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడిన సంగతి తెలిసిందే. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI)అధికారులు ఆమె వద్ద నుంచి సుమారు 14.7 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

వివరాలు 

రన్యారావుకి 'కాఫిపోసా' చట్టం కింద నమోదైన కేసులో  దక్కని ఊరట 

ఈ కేసులో పలువురు ఉన్నతాధికారులు,రాజకీయ నాయకుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నిందితులుగా గుర్తింపు పొందిన రన్యారావు, మరొక నిందితుడు తరుణ్ కొండూరు రాజును అధికారులు అరెస్ట్ చేశారు. వీరు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, కర్ణాటక హైకోర్టు దానిని తోసిపుచ్చింది. దీనితో 'కాఫిపోసా' చట్టం ప్రకారం వారికి ఒక సంవత్సరానికి పైగా బెయిల్ లభించదని అధికారులు స్పష్టం చేశారు. తాజాగా, ప్రత్యేక కోర్టు రన్యారావుకు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, కాఫిపోసా చట్టం కింద నమోదైన కేసులో ఆమెకు ఇప్పటికీ ఊరట దక్కలేదు.