Kolkata rape-murder case: ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ తండ్రి ఇంట్లో ఈడీ సోదాలు
జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన అనంతరం ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌లో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో, గురువారం ఉదయం ఈడీ అధికారులు కోల్‌కతా, పరిసర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. సోదాల్లో ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తండ్రి సత్య ప్రకాశ్ నివాసంలో కూడా ఈడీ తన విచారణ కొనసాగిస్తోంది. అదే సమయంలో, హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా డాక్టర్లు మరియు వైద్య సిబ్బంది నిరసనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు, డాక్టర్ హత్యాచార ఘటనలో నిర్లక్ష్యం వహించినందుకు సందీప్ ఘోష్ సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారని ఇప్పటికే తెలిసిందే.