Kejriwal Summoned: మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసిన ఈడీ
దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)సమన్లు జారీ చేసింది. నవంబర్ 2న ఆయన ఈడీ ఎదుట హాజరుకానున్నారు. మద్యం పాలసీ వ్యవహారంలో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) గతంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్‌ను ప్రశ్నించింది. ఈ కేసులో 338 కోట్ల రూపాయల మనీ ట్రయల్ "టెంటేటివ్ లి ఎస్టాబ్లిశిడ్ " అని పేర్కొంది. ఈ కేసులో మనీష్ సిసోడియా ప్రధాన నిందితుడు.
ఆప్‌ని అణగదొక్కాలని బీజేపీ కోరుకుంటోంది: సౌరభ్ భరద్వాజ్
ఈఏడాది ఏప్రిల్‌లో ఇదే కేసుకు సంబంధించి సీబీఐ కేజ్రీవాల్‌ను విచారణకు పిలిచింది. అయితే, గతేడాది ఆగస్టులో సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కేజ్రీవాల్‌ను నిందితుడిగా పేర్కొనలేదు. ED ఇటీవల జారీ చేసిన సమన్లపై AAP నాయకుడు,ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందిస్తూ బీజేపీ AAPని ఎలాగైనా అణిచివేయాలని అనుకుంటోందని ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్‌ను ఫేక్ కేసులో అరెస్టు చేసి ఆప్‌ని అణగదొక్కాలని బీజేపీ కోరుకుంటున్నారని భరద్వాజ్ అన్నారు. AAP నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన మద్యం పాలసీ కార్టలైజేషన్‌కు దారితీసిందని,మద్యం లైసెన్స్‌లకు అనర్హులు ద్రవ్య ప్రయోజనాల కోసం మొగ్గు చూపారని కేంద్ర దర్యాప్తు సంస్థలైన ED,CBI ఆరోపించాయి. కేజ్రీవాల్ ఈ ఆరోపణలను ఖండించారు. కొత్త విధానం వల్ల ఆదాయ వాటా పెరుగుతుందని పేర్కొన్నారు.