LOADING...
Active Andhra: క్రీడల ప్రోత్సాహానికి విద్యాశాఖ నూతన ప్రణాళిక.. 'యాక్టివ్ ఆంధ్ర' పేరుతో క్రీడా శిక్షణ
క్రీడల ప్రోత్సాహానికి విద్యాశాఖ నూతన ప్రణాళిక.. 'యాక్టివ్ ఆంధ్ర' పేరుతో క్రీడా శిక్షణ

Active Andhra: క్రీడల ప్రోత్సాహానికి విద్యాశాఖ నూతన ప్రణాళిక.. 'యాక్టివ్ ఆంధ్ర' పేరుతో క్రీడా శిక్షణ

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 05, 2025
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను క్రీడల్లోనూ మెరుగుపరిచేందుకు విద్యాశాఖ ప్రత్యేక దృష్టిసారించింది. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయడం కోసం 'యాక్టివ్‌ ఆంధ్ర' కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. క్రీడల ద్వారా విద్యార్థుల మానసిక వికాసం పెరగడంతో పాటు, గెలుపోటములను సమానంగా స్వీకరించే స్వభావం అలవడుతుందని భావిస్తోంది. ఈ కార్యక్రమాన్ని దిల్లీ పాఠశాలల్లో అమలు చేసిన నమూనా ఆధారంగా రూపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రాథమికంగా మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు పాఠశాలలో వేసవి సెలవుల వరకు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.

Details

కార్యక్రమాన్ని ఎలా అమలు చేస్తారు?

విద్యార్థులను 5-8, 9-14, 15-19 సంవత్సరాల వయసు గల వర్గాలుగా విభజిస్తారు. వారి ఆసక్తి ఉన్న క్రీడలను ఎంపిక చేసి, ప్రతి రోజూ గంటపాటు ఆడే అవకాశం కల్పిస్తారు. పాఠశాలల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్‌బాల్ వంటి క్రీడల కోసం మల్టీ కోర్టులు ఏర్పాటు చేస్తారు. పరుగు పందెం, ఇతర క్రీడల కోసం ప్రత్యేకంగా ట్రాక్‌లను నిర్మిస్తారు. వ్యాయామ ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అందిస్తారు. ఈ ప్రయోగాత్మక కార్యక్రమం విజయవంతమైతే, వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలని విద్యాశాఖ యోచిస్తోంది.

Details

స్పోర్ట్స్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలు 

నాలుగైదు పాఠశాలలకు ఓ స్పోర్ట్స్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పాఠశాల స్థాయిలో రాణించిన విద్యార్థులను ఈ కేంద్రాల్లో నిర్వహించే ప్రత్యేక శిబిరాలకు పంపి మరింత మెరుగైన శిక్షణ ఇస్తారు. చిన్నతనం నుంచే ప్రోత్సాహం కల్పిస్తే, విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులపై ఎక్కువ దృష్టి సారించి, పదేళ్ల పాటు శిక్షణ sఇచ్చి వారిని అగ్రశ్రేణి క్రీడాకారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నారు. జూనియర్‌ కళాశాలలు, విశ్వవిద్యాలయాల స్థాయిలోనూ క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నారు.

Details

 వ్యవస్థాపిత ప్రణాళిక 

విద్యార్థుల ప్రతిభను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. ఏ విద్యార్థికి ఏ క్రీడలో ఆసక్తి, ప్రతిభ ఉందో గుర్తించి, చదువుతోపాటు ప్రత్యేక శిక్షణ అందిస్తారు. పాఠశాల స్థాయిలో స్పోర్ట్స్‌ కరికులమ్ రూపొందిస్తారు. విద్యాశాఖ 'స్వీక్యోయియా ఫిట్నెస్‌ అండ్‌ స్పోర్ట్స్‌ టెక్నాలజీ' సంస్థతో కలిసి పని చేస్తోంది. ఈ విధంగా, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల క్రీడా ప్రతిభను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.