G-20 సమ్మిట్ : 8 ఆస్పత్రులకు హై అలెర్ట్ ప్రకటించిన దిల్లీ సర్కార్
G-20 సమ్మిట్ దృష్ట్యా 5 ప్రభుత్వ ఆస్పత్రులు, 3 ప్రైవేట్ ఆస్పత్రులను దిల్లీ ప్రభుత్వం హై అలెర్ట్ చేసింది. ఈ మేరకు సదస్సుకు వచ్చే అతిథులకు వైద్య సదుపాయాలను కల్పించేందుకు దిల్లీ ఆరోగ్య శాఖ సంసిద్ధమైంది. ఈ మేరకు ఎనిమిది ఆస్పత్రులను అప్రమత్తంగా ఉంచినట్లు ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ ప్రకటించారు. దిల్లీలోని పలు హోటళ్లలో బస చేసే అతిథుల కోసం వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో కూడిన 80 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. లోక్నాయక్ హాస్పిటల్, జీబీ పంత్, జీటీబీ హాస్పిటల్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ హాస్పిటల్, బాబా సాహెబ్ అంబేద్కర్ ఆస్పత్రి సహా ప్రైమస్(చాణక్యపురి), మాక్స్ హాస్పిటల్ (సాకేత్), మణిపాల్ హాస్పిటల్ (ద్వారక) ప్రైవేట్ ఆస్పత్రులకు హై అలెర్ట్ ప్రకటించారు.