Ganesh Immersion: వినాయక నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు.. 25వేల మందితో బందోబస్తు
హైదరాబాద్ పరిధిలో వినాయక నిమజ్జనాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు లక్ష విగ్రహాలు నిమజ్జనానికి తరలిరానున్న నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా 25,000 మంది పోలీసులను బందోబస్తును నిర్వహించారు. ముఖ్యంగా హుస్సేన్ సాగర్ చుట్టూ 3,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది హుస్సేన్ సాగర్‌లో 25,000 నుంచి 30,000 వరకు గణపతి విగ్రహాలను నిమజ్జనం చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఖైరతాబాద్ గణపతి విగ్రహాన్ని మధ్యాహ్నం 1.30లోపు నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు
మహిళల భద్రత ప్రత్యేకంగా షీటీమ్స్‌ను నియమించారు, హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో 12 షీటీమ్స్ ప్రత్యేక పహారా కాయనున్నాయి. ట్రాఫిక్ నియంత్రణ కోసం నగరవ్యాప్తంగా 67 డైవర్షన్ పాయింట్లను ఏర్పాటు చేశారు. అత్యవసర సమయంలో ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్లకు (9010203626, 8712660600, 040-27852482) ఫోన్ చేయాలన్నారు. ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర మంగళవారం ఉదయం 6.30గంటలకు ప్రారంభం కానుంది. భద్రతా చర్యలలో భాగంగా 700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. బాలాపూర్ వినాయకుడి శోభాయాత్ర ఉదయం 9 గంటలకు ప్రారంభమై, 16కి.మీ దూరం ప్రయాణించి ఎన్టీఆర్ మార్గ్ వద్ద ముగియనుంది.