ECI: ప్రశాంత్ కిషోర్‌కు ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసు..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రసిద్ధ ఎన్నికల వ్యూహకర్త,జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్‌కు ఎన్నికలకమిషన్ (EC) షోకాజ్ నోటీసు జారీ చేసింది. మంగళవారం ఈసీ తీసుకున్నఈ నిర్ణయానికి కారణం..ఆయన పేరు బిహార్,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఓటర్ల జాబితాల్లో ఒకేసారి కనిపించడం. బిహార్‌లోని రోహటాస్ జిల్లా ససరాం పరిధిలోకి వచ్చే కర్గాహార్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఈ నోటీసును జారీ చేశారు. కర్గాహార్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నంబర్ 621లో,ఎపిక్ (ఓటర్ ఐడి)నంబర్ 1013123718 కింద ప్రశాంత్ కిషోర్ ఓటరుగా నమోదు అయి ఉన్నారని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇదే సమయంలో,పశ్చిమబెంగాల్‌లోని భాబనిపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని సెయింట్ హెలెన్ స్కూల్ పోలింగ్ బూత్‌లో కూడా ఆయన పేరు ఓటర్ల జాబితాలో ఉందని రిటర్నింగ్ అధికారి వివరించారు.
వివరాలు
మూడు రోజులలోపు వివరణ ఇవ్వాలన్నఎన్నికల కమిషన్
ప్రజాప్రాతినిధ్య చట్టం,1950 ప్రకారం.. సెక్షన్ 17 కింద ఒక వ్యక్తి ఒకటికి మించి ఏ నియోజకవర్గంలోనూ పేరు నమోదు చేసుకోరాదు. ఈ నిబంధనను ఉల్లంఘించినట్లయితే,అదే చట్టంలోని సెక్షన్ 31 ప్రకారం,గరిష్టంగా ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, రెండు వేర్వేరు రాష్ట్రాల ఓటర్ల జాబితాల్లో పేరు నమోదయిన విషయంపై మూడు రోజుల లోపు వివరణ ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ప్రశాంత్ కిషోర్‌ను ఆదేశించింది. అయితే, బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున ఈసీ నోటీసుపై ఆయన వెంటనే స్పందించలేదని సమాచారం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రశాంత్ కిషోర్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు
EC sends notice to Prashant Kishor for having 2 Voter IDs pic.twitter.com/Dwb19EtkXB
— Ankur Singh (@iAnkurSingh) October 28, 2025