LOADING...
Rajya Sabha Election Schedule: 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

Rajya Sabha Election Schedule: 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
May 22, 2026
11:24 am

ఈ వార్తాకథనం ఏంటి

జూన్‌, జులై నెలల్లో 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. దేశంలోని పది రాష్ట్రాలకు చెందిన 24 రాజ్యసభ స్థానాల భర్తీకి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ స్థానాలకు జూన్‌ 18న ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జూన్‌ 1న జారీ చేయనున్నారు. అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు జూన్‌ 8ను చివరి తేదీగా నిర్ణయించారు. జూన్‌ 9న నామినేషన్ల పరిశీలన చేపట్టనుండగా, నామినేషన్ల ఉపసంహరణకు జూన్‌ 11 వరకు అవకాశం కల్పించారు. ఎన్నికల పోలింగ్‌ పూర్తైన అనంతరం అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

వివరాలు 

ఏపీలో నాలుగు స్థానాలకు ఎన్నికలు

మొత్తం ఎన్నికల ప్రక్రియను జూన్‌ 20 నాటికి పూర్తి చేయనున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాలుగు రాజ్యసభ స్థానాలకు కూడా జూన్‌ 18న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం రాజ్యసభలో ఏపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్‌, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్‌ నత్వానీ, సానా సతీశ్‌ల పదవీకాలం జూన్‌ 26తో ముగియనుంది. దీంతో ఖాళీ కానున్న ఈ నాలుగు స్థానాల భర్తీకి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.

Advertisement