Election results: ఉత్తర్‌ప్రదేశ్'లో సత్తా చాటిన ఇండియా కూటమి
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి ఉత్తర్‌ప్రదేశ్ లో మెజార్టీ సీట్లు సాధించింది.
మొత్తం 80 సీట్లకు గాను 40 చోట్ల జయకేతనం ఎగురవేసింది. యుపిలో గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో విజయ దుందుభిని మోగించింది.
ఎందుకి మార్పు ?
2019లో మొత్తం 80సీట్లకు 60చోట్ల విజయ ఢంకా మోగించింది.
సమాజ్ వాదిపార్టీ,బహుజన్ సమాజ్ పార్టీ కలిసి పోటీ చేశారు.వీరిద్దరికీ కలిపి 15 సీట్లు వచ్చాయి.సమాజ్ వాది 5 ,బహుజన్ సమాజ్ పార్టీ 10 చోట్ల గెలుపొందింది.
అయితే ఈ సారి బిఎస్పీ ఒంటరిగా పోటీ చేసింది.ఈసారి ఏనుగు పార్టీ ఆశించిన మేర ఫలితాలు చూపించలేదు. సమాజ్ వాదిపార్టీ 2024 లో 62 సీట్లలో పోటీ చేసింది. కాంగ్రెస్ 17 చోట్ల తలపడింది.
details
ఎన్నికల సమాచారం
రాయ్ బరేలీ,అమేధీల్లో హస్తం పార్టీ హవా చూపింది. అమేధీలో బిజెపి అభ్యర్ధి స్మృతి ఇరానీ వెనుకంజలో వున్నారు.
ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విధేయుడు కిషోర్ లాల్ సత్తా చూపారు. రాయ్ బరేలీలో రాహుల్ గాంధీ ..60 వేల ఓట్ల ఆధిక్యత లో వున్నారు.
రాయ్ బరేలీ, అమేధీల్లో కాంగ్రెస్ కు చాలా బలమైన నియోజకవర్గాలు. కొన్ని దశాబ్దాలుగా ఆ పార్టీ హవా కొనసాగించింది.