Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మే 13న పోలింగ్.. జూన్ 4న ఫలితాలు
భారత ఎన్నికల సంఘం శనివారం లోక్‌సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది. అరుణాచల్, సిక్కింలో ఏప్రిల్ 19న ఓటింగ్ జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్‌లో మే 13న ఓటింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని 175స్థానాలకు మే 13న ఒకేదశలో పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, ఏప్రిల్ 25వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఏప్రిల్ 29 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడించనుంది. ఒడిశాలోని 147అసెంబ్లీ స్థానాలకు నాలుగు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. 28 స్థానాలకు మే 13న, 35స్థానాలకు మే 20న, 42స్థానాలకు మే 25న, మిగిలిన 42స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది.
అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికలు
అరుణాచల్ ప్రదేశ్ లో కూడా ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 60 స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మార్చి 20న నోటిఫికేషన్ వెలువడనుండగా, మార్చి 27 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మార్చి 30 వరకు నామినేషన్ల ఉపసంహరణ.. జూన్ 4న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. సిక్కిం ఎన్నికలు సిక్కింలో ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 32 స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. మార్చి 20న నోటిఫికేషన్ వెలువడనుండగా, మార్చి 27 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. మార్చి 30 వరకు నామినేషన్ల ఉపసంహరణ.. జూన్ 4 న ఎన్నికల ఫలితాలు వెల్లడి ఉంటుంది.