Page Loader
Elections: ఏపీలో ఖాళీ పదవుల భర్తీకి ఎన్నికలు.. ఈసీ కొత్త నోటిఫికేషన్
ఏపీలో ఖాళీ పదవుల భర్తీకి ఎన్నికలు.. ఈసీ కొత్త నోటిఫికేషన్

Elections: ఏపీలో ఖాళీ పదవుల భర్తీకి ఎన్నికలు.. ఈసీ కొత్త నోటిఫికేషన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 27, 2025
05:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన ఆరు నెలల తర్వాత, రాష్ట్రంలో మరికొన్ని ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది. స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీ కోసం త్వరలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం, ఎన్నికల ఏర్పాట్ల కోసం కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం ఇవాళ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 30లోగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. వచ్చే నెల మూడో తేదీన ఈ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో నిర్వహించనున్నారు.

Details

ఖాళీగా చైర్ పర్సన్ పదవులు

ప్రస్తుతం తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్ పదవులు, నందిగామ, హిందూపురం, పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటికి ఎన్నికలు నిర్వహిస్తారు. అలాగే బుచ్చిరెడ్డిపాలెం, నూజివీడు, తుని, పిడుగురాళ్ల మున్సిపాలిటీలలో వైస్ చైర్‌పర్సన్ పదవుల భర్తీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఖాళీల భర్తీ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నోటిఫికేషన్ జారీ చేసినట్లు సమాచారం. సంబంధిత మున్సిపాలిటీల్లో కౌన్సిల్ సమావేశాలు నిర్వహించేందుకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అయితే రాష్ట్రంలో రెగ్యులర్ మున్సిపల్ ఎన్నికలు జరిగే వరకు, ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవుల్లో ఎన్నికైన వారు కొనసాగుతారు.