LOADING...
Rajya Sabha: 37 రాజ్య‌స‌భ సీట్ల కోసం మార్చి 16న ఎన్నిక‌లు
37 రాజ్య‌స‌భ సీట్ల కోసం మార్చి 16న ఎన్నిక‌లు

Rajya Sabha: 37 రాజ్య‌స‌భ సీట్ల కోసం మార్చి 16న ఎన్నిక‌లు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 18, 2026
11:13 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజ్యసభలో త్వరలో ఖాళీ కాబోయే స్థానాల భర్తీకి ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం పది రాష్ట్రాల్లో కలిపి సుమారు 37 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్న నేపథ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. తెలంగాణ నుంచి కేఆర్ సురేశ్ రెడ్డి, డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ పదవీకాలం ఏప్రిల్ 9న ముగియనుండటంతో, వారి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే మహారాష్ట్రలో అత్యధికంగా ఏడు మంది రాజ్యసభ సభ్యులు ఏప్రిల్ 2న పదవీ విరమణ చేయనుండటంతో, ఆ రాష్ట్రానికి చెందిన ఏడు సీట్లకు కూడా పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే,ఒడిశాలో నాలుగు,తమిళనాడులో ఆరు,పశ్చిమ బెంగాల్‌లో అయిదు, అస్సాంలో మూడు, బీహార్‌లో అయిదు స్థానాలు ఖాళీ కానున్నాయి.

వివరాలు 

ఫిబ్రవరి 26న విడుదల కానున్న నోటిఫికేషన్

చత్తీస్‌ఘడ్‌,హర్యానాల్లో రెండు చొప్పున, హిమాచల్ ప్రదేశ్‌లో ఒక రాజ్యసభ సీటుకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 37మంది రాజ్యసభ సభ్యులు ఏప్రిల్ నెలలో పదవీ విరమణ చేయనున్నారని, వారి స్థానాల భర్తీ కోసం ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తన తాజా మీడియా ప్రకటనలో స్పష్టం చేసింది. ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 26న విడుదల కానుంది. మార్చి 5 వరకు నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉండగా, మార్చి 9 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకోవచ్చు. మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరుగుతుండగా, అదే రోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పది రాష్ట్రాల్లో 37 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు

Advertisement