Page Loader
Rajya Sabha Elections: 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాలు ఎన్నికలు.. నోటిఫికేషన్ విడుదల 
Rajya Sabha Elections: 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాలు ఎన్నికలు.. నోటిఫికేషన్ విడుదల

Rajya Sabha Elections: 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాలు ఎన్నికలు.. నోటిఫికేషన్ విడుదల 

వ్రాసిన వారు Stalin
Jan 29, 2024
03:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

లోక్‌సభ ఎన్నికలకు ముందు.. 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల తేదీలను ప్రకటించారు. ఈ అన్ని స్థానాలకు ఫిబ్రవరి 27న ఓటింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 8న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. దేశంలోని 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్‌లో ముగియనుంది. నోటిఫికేషన్ జారీ- 8 ఫిబ్రవరి, 2024 నామినేషన్ చివరి తేదీ -ఫిబ్రవరి 15 నామినేషన్ల పరిశీలన -ఫిబ్రవరి 16 నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ - 20 ఫిబ్రవరి ఓటింగ్ తేదీ- ఫిబ్రవరి 20 పోలింగ్ సమయం- ఫిబ్రవరి 27

రాజ్యసభ

ఏపీలో 3, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికలు 

ఆంధ్రప్రదేశ్-3, బిహార్-6, ఛత్తీస్‌గఢ్-1, గుజరాత్-4, హర్యానా-1, హిమాచల్ ప్రదేశ్-1, కర్ణాటక -4, మధ్యప్రదేశ్- 5, మహారాష్ట్ర -6, తెలంగాణ- 3, ఉత్తరప్రదేశ్-10, ఉత్తరాఖండ్- 1, పశ్చిమ బెంగాల్-5, ఒడిశా -3, రాజస్థాన్ - 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 27న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఓటింగ్‌ పూర్తయిన తర్వాత అదే రోజు సాయంత్రం 5గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. తెలంగాణ నుంచి వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్‌, జోగినపల్లి సంతోష్‌కు సంబంధించిన స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఏపీ నుంచి సీఎం రమేశ్‌, కనకమేడల రవీంద్రకుమార్‌, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి.