
జడ్పీ సమావేశానికి ఏలూరు కలెక్టర్ డుమ్మా.. సీఎస్‌కు ఫిర్యాదు చేసిన పేర్ని నాని
ఈ వార్తాకథనం ఏంటి
ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ సమావేశానికి ఏలూరు కలెక్టర్ రాకపోవడంపై మంత్రి పేర్నీ నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఎస్ కు పిర్యాదు చేశారు.
మరోసారి ఏలూరు కలెక్టర్, అధికారులు సమావేశానికి డుమ్మా కొడితే నేరుగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు బైటాయిస్తానని పేర్ని నాని హెచ్చరించారు.
ముఖ్యంగా ఏలూరు కలెక్టర్ కు లేఖ రాయాలని జడ్పీ ఛైర్ పర్సన్ హారికకు నాని సూచించారు.
ఈ నేపథ్యంలో గురువారం సీఎస్ జవహర్ రెడ్డితో పేర్ని నాని భేటీ అయి, ఏలూరు కలెక్టర్ పై ఫిర్యాదు చేశారు.
Details
సీఎస్ కు వివరణ ఇచ్చిన ఏలూరు కలెక్టర్
సీఎస్ జవహర్ రెడ్డితో భేటీ తర్వాత పేర్ని నాని విలేకర్లతో మాట్లాడారు. ఒక్క ఉమ్మడి కృష్ణా జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు జడ్పీ సమావేశానికి రావడం లేదని ఆయన మండిపడ్డారు.
తనకు ఏలూరు కలెక్టర్ తో ఎలాంటి వ్యక్తిగత గొడవలు లేవని పేర్నినాని తేల్చి చెప్పారు. రాజ్యాంగం ఏర్పాటు చేసిన వ్యవస్థలను ప్రభుత్వాధికారులు నాశనం చేయకూడదన్నారు.
ఇదిలా ఉంటే ఏలూరు జిల్లా కలెక్టర్ కు సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. క్యాంప్ ఆఫీసులో సీఎస్ ను కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కలిశారు. సమావేశాలకు హాజరు అంశంపై సీఎస్ కు ఆయన వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.