LOADING...
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు,మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు.. 22 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు,మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు.. 22 మంది మావోయిస్టుల మృతి

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు,మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు.. 22 మంది మావోయిస్టుల మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 20, 2025
02:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. గురువారం బీజాపూర్-దంతెవాడ సరిహద్దులో భద్రతా బలగాలు,మావోయిస్టుల మధ్య తీవ్రమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 22 మంది మావోయిస్టులు హతమైనట్లు సమాచారం. బీజాపూర్-దంతెవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న సాంద్రమైన అడవుల్లో భద్రతా దళాలు నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో జిల్లాల నుంచి సంయుక్త బలగాలు అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులకు భారీగా నష్టం వాటిల్లినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

వివరాలు 

భద్రతా సిబ్బందిలో ఒకరికి గాయాలు 

బీజాపూర్ జిల్లాలోని గంగలూరు ప్రాంతంలో భారీ సంఖ్యలో మావోయిస్టులు తిష్టవేశారని సమాచారం అందడంతో భద్రతా బలగాలను అక్కడికి తరలించినట్లు ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. కాల్పులు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, భద్రతా సిబ్బంది పూర్తి నివేదిక అందించిన తర్వాత మరిన్ని వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. ఇక మరోవైపు, నారాయణపూర్ జిల్లాలో ఐఈడీ పేలుడు సంభవించగా, ఈ ఘటనలో భద్రతా సిబ్బందిలో ఒకరు గాయపడినట్లు తెలుస్తోంది.