తదుపరి వార్తా కథనం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు హతం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 16, 2025
09:02 am
ఈ వార్తాకథనం ఏంటి
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దండకారణ్యంలో మళ్లీ కాల్పుల ఘటనా చోటుచేసుకుంది.
కొండగావ్-నారాయణ్‌పుర్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తలదాచుకుని ఉన్నారని సమాచారం రావడంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి.
ఈ దశలో భద్రతా సిబ్బందిని చూసిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించగా, బలగాలు కూడా ఎదురుగా కాల్పులు జరిపాయి.
Details
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
ఎదురుకాల్పుల మధ్య మావోయిస్టులు అటవీ ప్రాంతంలోకి పారిపోయారు.
ఎన్‌కౌంటర్ ముగిసిన అనంతరం భద్రతా బలగాలు ఇద్దరి మృతదేహాలు, ఒక ఏకే-47 తుపాకీని స్వాధీనం చేసుకున్నాయి.
మృతులు మావోయిస్టు అగ్రనేతలుగా భావిస్తున్నా, వారి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం ఆ ప్రాంతంలో విస్తృత గాలింపు కొనసాగుతోందని బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్‌రాజ్ తెలిపారు.