Page Loader
Encounter: కుప్వారాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
కుప్వారాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

Encounter: కుప్వారాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 05, 2024
10:07 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడి 'ఆపరేషన్ గుగల్‌ధార్' పేరిట సైన్యం చేపట్టింది. చొరబాటు ప్రయత్నం గురించి నిఘా ఆధారంగా ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. భారత సైన్యం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఇక ఉగ్రవాదుల నుంచి 'యుద్ధ సామగ్రి'ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ను భారత సైన్యం, జమ్మూ & కాశ్మీర్ పోలీసుల సంయుక్త ప్రయత్నంగా జరిగింది.

Details

ల్యాండ్ మైన్ పేలుడులో ఇద్దరు సైనికులకు గాయాలు

కుప్వారాలోని నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నం చేయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక మరో ఘటనలో, కుప్వారా నియంత్రణ రేఖ సమీపంలో శుక్రవారం ల్యాండ్‌మైన్ పేలుడులో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. ఈ పేలుడు ఉత్తర కాశ్మీర్‌లోని ట్రెహ్‌గామ్ ప్రాంతంలో గూగల్‌దారా వద్ద సైనికుల పెట్రోలింగ్‌లో చోటుచేసుకుంది. గాయపడిన సిబ్బందిని డ్రగ్ముల్లా ఆర్మీ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.