NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Amaravati: అమరావతి కొత్త రైల్వే లైన్.. కీలక నగరాలతో అనుసంధానం
    తదుపరి వార్తా కథనం
    Amaravati: అమరావతి కొత్త రైల్వే లైన్.. కీలక నగరాలతో అనుసంధానం
    అమరావతి కొత్త రైల్వే లైన్.. కీలక నగరాలతో అనుసంధానం

    Amaravati: అమరావతి కొత్త రైల్వే లైన్.. కీలక నగరాలతో అనుసంధానం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 25, 2024
    09:03 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమరావతి మీదుగా రైల్వే మార్గం నిర్మాణానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎర్రుపాలెం నుండి అమరావతి మీదుగా నంబూరు వరకు 57 కి.మీ. పొడవు ఉన్న రైల్వే లైన్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

    ఈ ప్రాజెక్ట్‌ పనులు త్వరలోనే వేగంగా ప్రారంభం కానున్నాయి. రైల్వే శాఖ జూన్ నెలలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి గెజిట్‌ విడుదల చేసి, దీనిని ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించింది.

    ప్రస్తుతం కేంద్రం ఆమోదంతో, భూసేకరణ కూడా ప్రారంభమైంది. టెండర్లు పిలిచి, నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

    రైల్వే బోర్డు ఇప్పటికే డీపీఆర్ (వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక) కు ఆమోదం తెలిపింది.

    వివరాలు 

    భూసేకరణ ప్రక్రియ

    ఈ ప్రాజెక్ట్‌లో, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ఖమ్మం జిల్లాల పరిధిలో మొత్తం 450 హెక్టార్ల భూమిని సేకరించనున్నారు.

    భూసేకరణకు సంబంధించిన చర్యలు వేగంగా జరగనుండగా, రైల్వే మార్గం కోసం అవసరమైన సర్వేలు కూడా పూర్తయ్యాయి.

    కాజీపేట-విజయవాడ మార్గంలో కొత్త స్టేషన్లు

    కాజీపేట-విజయవాడ ప్రధాన మార్గంలో ఎర్రుపాలెం వద్ద ప్రారంభమయ్యే ఈ కొత్త లైన్, విజయవాడ-గుంటూరు మార్గంలో నంబూరు వద్ద కలుస్తుంది.

    ఈ లైన్‌లో మొత్తం 9 కొత్త రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు: పెద్దాపురం, చెన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావూరు.

    ఇందులో అమరావతి, పెద్దాపురం, కొప్పురావూరు స్టేషన్లను పెద్దగా అభివృద్ధి చేయనున్నారు.

    ఇక పరిటాల వద్ద ఎక్కువగా గూడ్స్ రైళ్ల నిల్వల కోసం ప్రత్యేకమైన సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.

    వివరాలు 

    కృష్ణా నదిపై వంతెన నిర్మాణం

    కొత్తపేట-వడ్డమాను మధ్యలో కృష్ణా నదిపై 3.2 కి.మీ. పొడవు ఉన్న వంతెన నిర్మించనున్నారు. ఈ వంతెన రైల్వే మార్గానికి కీలకంగా ఉండనుంది.

    సింగిల్ లైన్ వల్ల నిరాశ

    కేంద్రం ఆమోదం ఇచ్చినప్పటికీ, డబుల్ లైన్‌కు బదులుగా సింగిల్ లైన్ మాత్రమే నిర్మిస్తుండడంతో కొంత నిరాశ వ్యక్తమవుతోంది.

    రాజధాని అమరావతికి దక్షిణం నుంచి, ఉత్తరభాగం నుండి మరింత సులభంగా రైళ్లు చేరే విధంగా లింక్‌లైన్లకు సంబంధించి అనేక ప్రతిపాదనలు ముందుకు వచ్చినప్పటికీ, వాటిని ఆమోదించకపోవడం వల్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది.

    వివరాలు 

    ప్రాజెక్ట్ వెనుకబాటు

    ఈ ప్రాజెక్ట్ 2017-18లో మంజూరైంది. ఈ లైన్ కోసం మొదట డబుల్ లైన్ ప్రతిపాదించారు. కానీ ఎర్రుపాలెం-నంబూరు మధ్య 57 కి.మీ. సింగిల్ లైన్‌కు మాత్రమే క్లియరెన్స్ ఇచ్చారు.

    గతంలో సికింద్రాబాద్ నుంచి నేరుగా అమరావతికి చేరే లింక్ లైన్ నిర్మాణం ప్రతిపాదనలో ఉంది.

    కానీ ఇప్పుడు ఆ లింక్ లైన్‌కు ఆమోదం రాకపోవడంతో, సికింద్రాబాద్ నుంచి గుంటూరు వరకు వెళ్లి, ఆపై రోడ్డు మార్గంలో రాజధానికి చేరుకోవాల్సి వస్తోంది.

    వివరాలు 

    రైల్వే ప్రాజెక్టుకు పునర్వ్యవస్థ

    రాజధాని అమరావతి మీదుగా ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య ప్రయాణించే రైళ్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.

    అమరావతి రైల్వే మార్గం పూర్తయితే, ఉత్తరాది నుండి దక్షిణాది రాష్ట్రాలకు ప్రయాణం మరింత సులభమవుతుంది.

    అమరావతితో హైదరాబాద్, సికింద్రాబాద్, ముంబయి, నాగ్‌పూర్ వంటి నగరాలు అనుసంధానమవుతాయి.

    అంతేకాకుండా దక్షిణభాగంలో చెన్నై, తమిళనాడు, కేరళ ప్రాంతాలకు కూడా రైళ్లు అమరావతిలోంచి ప్రయాణం చేస్తాయి.

    విజయవాడ రైల్వే స్టేషన్‌పై ఒత్తిడి తగ్గింపు

    ప్రస్తుతం విజయవాడ మీదుగా రోజూ 250కి పైగా రైళ్లు ప్రయాణిస్తుండటంతో, ఈ స్టేషన్‌పై తీవ్రమైన ఒత్తిడి ఉంది. అమరావతి లైన్ ప్రారంభం అయితే, ఆ ఒత్తిడిని తగ్గించేందుకు వీలవుతుంది.

    వివరాలు 

    ఐదేళ్లు తొక్కిపెట్టిన జగన్‌ ప్రభుత్వం 

    జగన్‌ సర్కారు ఐదేళ్లపాటు అమరావతి ప్రాజెక్టును పూర్తిగా అడ్డుకోవడంతో ఈ ప్రాజెక్ట్‌లో పెద్దగా పురోగతి కనిపించలేదు.

    రైల్వే శాఖ కూడా ప్రతియేటా రూ.1000 మాత్రమే కేటాయిస్తూ వస్తోంది. కానీ, ఈ ఏడాది చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా వచ్చాక, ప్రాజెక్టుకు కొత్త ఊపిరి వచ్చింది.

    రైల్వే శాఖ ప్రాజెక్ట్‌కు సంబంధించిన డీపీఆర్‌ సిద్ధం చేసి, కేంద్రం ఆమోదం తెలపడంతో, పనులు వేగంగా ప్రారంభమవుతాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమరావతి
    రైల్వే శాఖ మంత్రి

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    అమరావతి

    అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే మైలవరం
    అమరావతిపై విచారణను జులై 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్‌‌లో చల్లచల్లగా; రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు  ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట; చంద్రబాబు పాలనలో నిర్ణయాలపై విచారణకు లైన్ క్లియర్  ఆంధ్రప్రదేశ్

    రైల్వే శాఖ మంత్రి

    రెండు రైళ్లు ఢీకొని 26 మంది మృతి; 85 మందికి గాయాలు గ్రీస్
    దిల్లీ మెట్రో రైళ్లలో రీల్స్, డ్యాన్స్ వీడియోలు చిత్రీకరించడం నిషేధం: డీఎంఆర్‌సీ దిల్లీ
    ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు గురించి రైల్వే మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ట్విట్టర్
    తెలుగు రాష్ట్రాలకు హై స్పీడ్ రైలు కారిడార్; 4గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు! ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025