
Etela Rajender : బీజేపీ గెలిస్తే నేనే సీఎం.. 30 మంది బీసీ నేతల ముందు మోదీ మాటిచ్చారు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, హుజురాబాద్, గజ్వేల్ అసెంబ్లీ అభ్యర్థి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రి అవుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ మేరకు 30 మంది బీసీ ప్రముఖుల ముందు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారన్నారు.
ఎల్బీస్టేడియంలో జరిగిన బీజేపీ బీసీ జనగర్జన సభ తర్వాత, పలు అంశాలపై మోదీ తనతో చర్చించారని ఈటల అన్నారు.
అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ని తప్పించాక పార్టీలో ఈటల రాజేందర్‌కు ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది.
Details
ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల
ఇప్పటికే హుజురాబాద్ నుంచి ఈటల ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్యశాఖమంత్రిగా పనిచేశారు.
మంత్రి పదవి నుంచి తప్పించిన తర్వాత బీఆర్ఎస్ పక్షాన గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఉప ఎన్నికలకు తెరలేపారు.
అధికార బీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ని ఘోరంగా ఓడించి భారీ విజయాన్ని అందుకున్నారు.
తెలంగాణలో అత్యధిక మంది జనాభా ఉన్న సామాజికవర్గాల్లో ఒకటైన ముదిరాజ్ నుంచి ఎదిగిన బలమైన బీసీ నేతగా ఈటలకు పేరుంది. ఈ క్రమంలోనే ఈటలకు బీజేపీ పెద్దలు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈటల, కేసీఆర్‌ని ఓడించేందుకు గజ్వేల్ బరిలో నిలిచారు. ఫలితంగా ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి
Details
అందుకే బండి సంజయ్ పదవి పోయిందంట
అయితే గతంలో ఓ పార్టీ సభలో బండి సంజయ్ ప్రసంగిస్తున్న సమయంలో కార్యకర్తలు సీఎం, సీఎం అంటూ నినాదాలు చేశారు.
మీరు 'సీఎం, సీఎం' అని అరవడం కారణంగానే పదవి పోయిందని బండి సంజయ్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఒకదశలో ఈటల కారణంగానే బండి పదవిపోయిందన్న ప్రచారం అప్పట్లో జోరందుకుంది.
బండి సంజయ్ అందరినీ కలుపుతూ వెళ్లట్లేదని, ఈటల దిల్లీ పెద్దల చెవిలో ఉదారని పలుమార్లు ఫిర్యాదులు వెళ్లినట్లు ప్రచారం జరిగింది.
బీసీ వర్గానికి చెందిన ఈటల, బండి సంజయ్ సీఎం రేసులో ఉన్న కారణంగానే బండిని అధ్యక్ష పదవి నుంచి తప్పించామని జాతీయ సీనియర్ నేత మురళీధర్ అన్నారు.
details
బీఆర్ఎస్ సీఎం అభ్యర్థి కేసీఆర్ అయితే బీజేపీకి ఈటలే
బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న కేసీఆర్, తన నాయకత్వంలో కుడిభుజంగా పనిచేసిన ఈటలకు గులాబీ పార్టీ నుంచి ఉద్వాసన పలికడం తెలిసిందే.
అయితే ఆ నాటి నుంచి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీల పతనమే లక్ష్యంగా ఈటల రాజేందర్ ముందుకుసాగుతున్నారు.
దీని కోసమే తన కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను వదులుకుని, అందుకు కాస్తో కూస్తో దగ్గరగా ఉన్న కాంగ్రెస్ పార్టీని సైతం వదిలి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఎంచుకున్నారు.
తనను అన్యాయంగా గులాబీ గూటి నుంచి దూరం చేసిన కేసీఆర్ మరోసారి సీఎం కాకూడదు, బీఆర్ఎస్ అధికారంలోకి రావొద్దని ఈటల తీవ్రంగా పోరాడుతున్నారు.
అందులో భాగంగానే కేసీఆర్ సర్కార్ మరోసారి రాకూడదని ఈటల కంకణం కట్టుకోవడం గమనార్హం.