ETHANOL: కేంద్రం కీలక నిర్ణయం..ఎథనాల్ కలపడానికి గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ఇంధనంగా ఉపయోగించే ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)లో ఎథనాల్ కలపడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పెట్రోలియం రంగంలో ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రభుత్వానికి అనేక రకాలుగా ఉపయోగాలు కలగనున్నాయి.
వివరాలు
రైతులకు మరింత లాభదాయకం..
ఇప్పటికే పెట్రోల్‌లో ఎథనాల్ మిశ్రమాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు అదే విధానాన్ని విమానయాన రంగానికీ విస్తరించేందుకు ముందుకొచ్చింది. దీని ద్వారా దేశంలో క్రూడ్ ఆయిల్ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడమే కాకుండా, పర్యావరణ కాలుష్యాన్ని కూడా నియంత్రించవచ్చని అధికారులు భావిస్తున్నారు. అలాగే ఈ నిర్ణయం రైతులకు కూడా లాభదాయకంగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎథనాల్ ఉత్పత్తి పెరగడంతో చెరకు వంటి పంటలకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి, శుద్ధ ఇంధనాల వైపు దేశాన్ని మళ్లించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న పోస్ట్ ఇదే..
ETHANOL BLENDING IN ATF NOW PERMITTED BY GOVT #BREAKING
— RedboxGlobal India (@REDBOXINDIA) April 22, 2026