
EV CAR : బెంగళూరులో ఈవీ కారు దగ్ధం..ఆందోళనలో ఎలక్ట్రిక్ వాహన వినియోగాదరులు
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలో ఓ ఎలక్ట్రిక్ కారు నడి రోడ్డుపైనే అగ్నికి ఆహుతైంది. రాష్ట్ర రాజధాని బెంగళూరులోని జేపీ నగర్ దాల్మియా సర్కిల్‌లో ఈ ప్రమాదం జరిగింది.
కారులోంచి మంటలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు, ఆగమేఘాల మీద బయటికి వచ్చేశారు. అనంతరం కారు నుంచి మంటలు చెలరేగాయి. దీంతో చూస్తుండగానే కారు దగ్ధమైంది.
ఎలక్ట్రిక్ కారు మంటల్లో కాలిపోవడంపై విద్యుత్ వాహనాల భద్రతపైనే అనుమానాలు రెకెత్తుతున్నాయి.
పగలు ఎక్కువగా వేడి ఉండటం వల్ల ఈవీలోని బ్యాటరీల్లో మంటలు చెలరేగుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ క్రమంలోనే వాహనాలు కాలిపోతున్నాయని, దీంతో ప్రాణాలకే ఎసరు అని జనం బెంబెలిత్తిపోతున్నారు.
ఈవీ తయారీదారులు పటిష్ఠ భద్రతా ప్రమాణాలు పాటించాలని డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రోడ్డుపై కాలిపోతున్న కారు
#Bengaluru: An #electric #car caught #fire near Dalmia Circle in #JPNagar area today. No casualties. Reason is yet to be ascertained.#Karnataka #EV #ElectricVehicles #india pic.twitter.com/z7rVVxgJSn
— Siraj Noorani (@sirajnoorani) September 30, 2023