
జంట హత్యల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. మాజీ ఎంపీకి జీవిత ఖైదు విధింపు
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ జంట హత్యల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)పార్టీకి చెందిన మహారాజ్‌గంజ్ మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్‌కు శుక్రవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
1995 ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా ఓటు వేసినందుకు ఇద్దరు వ్యక్తుల్ని కాల్చి చంపిన కేసులో సింగ్ ఆయనను సుప్రీం దోషిగా తేల్చింది.
నేర న్యాయ వ్యవస్థలో ఈ ఎపిసోడ్ బాధాకరమైందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆగస్ట్ 18న జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ విక్రమ్‌నాథ్‌లతో కూడిన ధర్మాసనం ఐపీసీ సెక్షన్ 302, 307 కింద సింగ్‌ను దోషిగా నిర్ధారించింది.
మరోవైపు మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల మేర ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని బీహార్ సర్కారును అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్‌కు జీవిత ఖైదు
Supreme Court sentenced life imprisonment to Bihar politician Prabhunath Singh in a matter pertaining to 1995 double murder case pic.twitter.com/1WmHpKB6nb
— ANI (@ANI) September 1, 2023