Divya Pahuja: హర్యానా కాలువలో మాజీ మోడల్ దివ్య పహుజా మృతదేహం గుర్తింపు
జనవరి 2న గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన మాజీ మోడల్ దివ్య పహుజా (27) మృతదేహాన్ని గురుగ్రామ్ పోలీసుల బృందం శనివారం స్వాధీనం చేసుకుంది. పహుజా మృతదేహాన్ని హర్యానాలోని తోహ్నాలోని కాలువ నుంచి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పహుజా మృతదేహం ఫోటోను ఆమె కుటుంబ సభ్యులకు పంపారు. అది పహుజా మృతదేహంగా కుటుంబ సభ్యులు ధృవీకరించారు. పహుజా మృతదేహాన్ని వెలికితీసేందుకు గురుగ్రామ్ ఆరు పోలీసు బృందాలు పని చేశాయి. పోలీసులకు సాయంగా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF)కు 25 మంది కూడా రంగంలోకి దిగారు.
బ్లాక్ మెయిల్ చేస్తోందని చంపేశా: సూత్రదారి అభిజిత్ సింగ్
పహుజాను జనవరి 2న గురుగ్రామ్‌లో సిటీ పాయింట్ హోటల్ యజమాని అభిజిత్ సింగ్ హత్య చేశాడు. పహుజా తనను అసభ్యకరమైన వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తోందని.. అందుకే ఆమెను హత్య చేసినట్లు అభిజిత్ సింగ్ పేర్కొన్నాడు. గురుగ్రామ్ హోటల్‌లో పహుజాను హత్య చేసిన తర్వాత జనవరి 3న పాటియాలాలోని కాలువలో మృతదేహాన్ని పారవేసినట్లు మాజీ మోడల్ దివ్య పహుజా దారుణ హత్య కేసులో కీలక నిందితుల్లో ఒకరు పోలీసులకు చెప్పాడు. అభిజిత్ సింగ్ సన్నిహిత సహచరుడు బాల్‌రాజ్ గిల్‌ను మృతదేహాన్ని పారవేయమని చెప్పడంతో అతను పాటియాలాలోని కాలువలో విసిరేశాడు. ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పాడు. ఇదే కేసులో మరో ప్రధాన నిందితుడు రవి బంగా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.