LOADING...
Sabyasachi Dutta: టీఎంసీ మాజీ ఎమ్మెల్యే సబ్యసాచి దత్తపై కోడిగుడ్లు,ఆవుపేడతో దాడి.. వీడియో
టీఎంసీ మాజీ ఎమ్మెల్యే సబ్యసాచి దత్తపై కోడిగుడ్లు,ఆవుపేడతో దాడి.. వీడియో

Sabyasachi Dutta: టీఎంసీ మాజీ ఎమ్మెల్యే సబ్యసాచి దత్తపై కోడిగుడ్లు,ఆవుపేడతో దాడి.. వీడియో

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2026
11:21 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మాజీ ఎమ్మెల్యే, బిదాన్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సబ్యసాచి దత్తపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరింపులు,డబ్బుల వసూళ్ల కేసులో అరెస్టైన ఆయనను కోర్టుకు తరలిస్తుండగా కోడిగుడ్లు,ఆవుపేడ, టమోటాలతో దాడి చేశారు. ఈ ఘటన బిదాన్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో కలకలం రేపగా,దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాల్ట్ లేక్‌కు చెందిన వ్యాపారి మధుసూదర్ చక్రవర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సబ్యసాచి దత్తను అదుపులోకి తీసుకున్నారు. వ్యాపారిని బెదిరించి సుమారు రూ.కోటి డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో కొంత మొత్తాన్ని దత్తకు అందించినట్లు సమాచారం. Embed

వివరాలు 

"దొంగ.. దొంగ" అంటూ పెద్దఎత్తున నినాదాలు

డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గుల్లు అనే వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో సబ్యసాచి దత్తను స్థానిక కోర్టులో హాజరుపర్చగా, ఆయనకు ఎనిమిది రోజుల పోలీసు కస్టడీ విధించింది. అనంతరం కోర్టుకు తీసుకెళ్తున్న సమయంలో కొందరు స్థానికులు ఆయనపై కోడిగుడ్లు, ఆవుపేడ, టమోటాలు విసిరి నిరసన తెలిపారు. మరోవైపు కోర్టు ఆవరణలో ఉన్న మరో గుంపు "దొంగ.. దొంగ" అంటూ పెద్దఎత్తున నినాదాలు చేసింది. బిదాన్‌నగర్ ప్రాంతంలో సబ్యసాచి దత్త పలు అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని మంత్రి శరద్‌వాత్ ముఖర్జీ ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది.

వివరాలు 

2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బిదాన్‌నగర్ నుంచి పోటీ చేసి ఓటమి

సబ్యసాచి దత్త రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. 2000 సంవత్సరంలో బిదాన్‌నగర్ మున్సిపాలిటీలో టీఎంసీ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. అనంతరం 2015లో బిదాన్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2019లో మేయర్ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బిదాన్‌నగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం తిరిగి టీఎంసీలో చేరి బిదాన్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మాజీ ఎమ్మెల్యేపై గుడ్లు, ఆవుపేడతో దాడి వీడియో వైరల్

Advertisement