LOADING...
Kota Vinutha : కోట వినుత సెల్ఫీ వీడియో విడుదల.. 'త్వరలో ఆధారాలతో మీడియా ముందుకొస్తా'
కోట వినుత సెల్ఫీ వీడియో విడుదల.. 'త్వరలో ఆధారాలతో మీడియా ముందుకొస్తా'

Kota Vinutha : కోట వినుత సెల్ఫీ వీడియో విడుదల.. 'త్వరలో ఆధారాలతో మీడియా ముందుకొస్తా'

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 13, 2025
02:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

డ్రైవర్‌ రాయుడు హత్య కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్‌ఛార్జ్‌ కోట వినుత స్పష్టం చేశారు . ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. "మేము చేయని తప్పుకి జైలుకు వెళ్లాల్సి వచ్చినందుకు బాధ లేదు. కానీ, మేమే హత్య చేశామంటూ ప్రచారం జరగడం మాత్రం చాలా బాధ కలిగించింది. రాయుడు హత్యలో మా ప్రమేయం లేదని కోర్టు గుర్తించినందుకే కేవలం 19 రోజుల్లోనే బెయిల్‌ లభించింది. నేను విదేశాల్లో లక్షల రూపాయల జీతాన్ని వదిలి రాజకీయాల్లోకి రావడం ప్రజలకు సేవ చేయడానికే.. కానీ ఎవరి ప్రాణాలు తీయడానికి కాదు. అలాంటి మనస్తత్వం నాకు లేదు," అని వినుత తెలిపారు.

వివరాలు 

"న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది

అలాగే, ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించుకుని తప్పకుండా బయటపడతామని కోట వినుత నమ్మకం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానంలో విచారణలో ఉన్నందున, ఈ అంశంపై మరింతగా మాట్లాడకూడదని తమ న్యాయవాదులు సూచించారని తెలిపారు. తనపై జరిగిన కుట్రకు సంబంధించిన ఆధారాలు, వీడియోలను త్వరలోనే మీడియా ముందు ఉంచుతానని ఆమె చెప్పారు. "న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది," అని కోట వినుత పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సెల్ఫీ వీడియో విడుదల చేసిన కోట వినుత