Page Loader
Tamilnadu: తమిళనాడు పటాకుల గోదాములో పేలుడు.. ఇద్దరు దుర్మరణం
తమిళనాడు పటాకుల గోదాములో పేలుడు.. ఇద్దరు దుర్మరణం

Tamilnadu: తమిళనాడు పటాకుల గోదాములో పేలుడు.. ఇద్దరు దుర్మరణం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 01, 2024
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులో తూత్తుకుడి జిల్లా నజరేత్ సమీపంలోని బాణాసంచా ఫ్యాక్టరీ గోదాములో శనివారం సాయంత్రం ఘోర పేలుడు సంభవించింది. ఈ ఘటనలోల ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయపడ్డారు, ఇందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. పటాకులను ఒకచోట నుంచి మరొకచోటికి తరలించే క్రమంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతులను కన్నన్, విజయ్‌లుగా గుర్తించారు.

Details

మృతుల కుటుంబానికి నష్టపరిహారం 

గాయపడిన నలుగురిని తిరునల్వేలి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 3 లక్షలు, గాయపడిన వారికి రూ. 1 లక్ష సాయం అందజేయనున్నట్లు తెలిపారు.