Page Loader
Delhi: ఢిల్లీ PVR సమీపంలోని దుకాణంలో పేలుడు.. పేలుడుకు కారణంపై ఆరా
ఢిల్లీ PVR సమీపంలోని దుకాణంలో పేలుడు.. పేలుడుకు కారణంపై ఆరా

Delhi: ఢిల్లీ PVR సమీపంలోని దుకాణంలో పేలుడు.. పేలుడుకు కారణంపై ఆరా

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 28, 2024
01:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో మరోసారి పేలుడు సంచలనం రేపింది. ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించడంతో స్థానికులు ఆందోళన చెందారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా,అగ్నిమాపక సిబ్బంది,పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం పేలుడుకు కారణం తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఎలాంటి స్పష్టత లేదు. ఢిల్లీ ఫైర్ సర్వీస్ ప్రకారం, గురువారం ఉదయం 11:58 గంటలకు ఈ ఘటనపై సమాచారం అందింది. వెంటనే అగ్నిమాపక యంత్రాలను ఘటనా స్థలానికి పంపించారు. పోలీసుల కథనం ప్రకారం, బన్సీ స్వీట్స్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఇదే ప్రాంతంలో అక్టోబర్ 20న కూడా పేలుడు జరిగిన విషయం గమనార్హం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు