
నరేష్ గోయల్: ఈడీ విచారణలో బయటకొచ్చిన విస్తుపోయే వాస్తవాలు
ఈ వార్తాకథనం ఏంటి
జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ విచారణలో విస్తుపోయే నిజాలు బయటికొచ్చాయి. ఈడీ విచారిస్తున్న ఈ కేసులో నిందితుడు నరేష్ గోయల్‌ను 10రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ పీఎంఎల్ఏ కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
కెనరా బ్యాంక్ నుంచి రూ.539 కోట్ల రుణాలను ఎగవేసిన ఆరోపణలతో జెట్ ఎయిర్ లైన్స్‌పై ఈడీ విచారణ జరుగుతోంది.
మరోవైపు నరేష్ గోయల్‌కు దుబాయ్, యూకేతో సహా విదేశాల్లో ఆస్తులను కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
జెట్ ఎయిర్ వేస్ రూ.848.86 కోట్ల రుణం తీసుకొని అందులో 538 కోట్ల రుణ బకాయిలు చెల్లించలేదని ఆరోపిస్తూ బ్యాంకు ఫిర్యాదుపై ఎఎఫ్ఆర్ నమోదైంది.
Details
కెనరా బ్యాంకు రుణాల సొమ్మును బోగస్ ఖర్చులుగా చూపిన నరేష్ గోయల్
జెట్ ఎయిర్ వేస్ అనుబంధ సంస్థలు, ఇతర నిదితులతో కుమ్మకై కెనరా బ్యాంకు రుణాల సొమ్మును బోగస్ ఖర్చులుగా చూపించి మోసగించారని విచారణలో తేలింది.
అదే విధంగా ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ ఖర్చుల కింద నరేష్ గోయల్ వెయ్యి కోట్ల రూపాయల సందేహాస్పదమైన ఖర్చులను బుక్ చేసినట్లు ఈడీ నిర్ధారించింది.
ఈ ఖర్చుల్లో నరేష్ గోయల్, అతని కుటుంబ సభ్యుల వ్యక్తిగత ఖర్చులు, అలాగే ప్రమోటర్ల విదేశీ ఖాతాలకు జమ చేసిన లెక్కలు చూపని లావాదేవీలున్నట్లు తెలిసింది.
నరేష్ గోయల్ భార్య అనతి, కుమార్తె నమ్రత, కుమారుడు నివాన్‌లకు 2011-2012, 2018-2019 సంవత్సరాల్లో జిఐఎల్ ఖాతాల నుంచి రూ.9.46 కోట్లు చెల్లించినట్లు ధ్రువీకరించింది.