Fake CBI Gang Cleans: నకిలీ సీబీఐ అధికారుల హల్‌చల్ ...MNC,AGMకి రూ .85 లక్షల టోకరా
ఒక బహుళజాతి సంస్థకు(MNC)చెందిన రిటైర్డ్ అసోసియేట్ జనరల్ మేనేజర్(AGM) సిబిఐ, కస్టమ్స్, నార్కోటిక్స్ ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌లుగా చలామణీ అవుతున్ననకిలీ ముఠా రూ .85 లక్షలకు విశాఖపట్టణంలో టోకరా వేసింది. ఈ తతంగమంతా - స్కైప్‌లో జరగడం గమనార్హం . దీనిపై విశాఖపట్నం, ఢిల్లీలో పోలీసు కేసు నమోదైంది. ఈ ముఠా నగదును చెక్కు ద్వారా తీసుకుని ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లో హెచ్‌డిఎఫ్‌సి ఖాతాకు 'రాణా గార్మెంట్స్' అనే కంపెనీకి బదిలీ చేసింది. విశాఖపట్నంలో పోలీసులకు దాఖలు చేసిన ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) ప్రకారం, ఈ ముఠా 'రాణా గార్మెంట్స్' నడుపుతున్న హెచ్‌డిఎఫ్‌సి ఖాతా నుండి డబ్బును భారతదేశ వ్యాప్తంగా 105 ఖాతాలకు బదిలీ చేసింది.
కుమారుడిని చదువుల కోసం విఆర్ఎస్
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఉత్తమ్ నగర్ బ్రాంచ్ కూడా మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని బాధితుడు ఎన్‌డిటివికి తెలిపారు. మూడు సంవత్సరాల సర్వీస్ మిగిలి ఉండగానే తన కుమారుడిపై చదువుల కోసం విదేశాలకు పంపటానికి డబ్బు అవసరమవడంతో,అందుకోసం మూడు సంవత్సరాల సర్వీస్ వున్నా వి.ఆర్.ఎస్ తీసుకున్నట్లు రిటైర్డ్ (AGM) చెప్పుకొచ్చాడు. మే 2న రిటైర్మెంట్ సెటిల్మెంట్ డబ్బు వచ్చిందని వివరించారు.మా అబ్బాయి వీసా అపాయింట్‌మెంట్ మే 17నకానీ మే 14న, తన రికార్డులను తనిఖీ చేసిన తర్వాత తిరిగి ఇస్తామని చెప్పి, నకిలీ ముఠా రూ .85 లక్షలు తీసుకుని మోసం చేసిందని 57 ఏళ్ల MNC రిటైర్డ్ (AGM) వాపోయారు.
విచారణ ప్రారంభించిన విశాఖ క్రైం బ్రాంచ్
ఇదిలా వుంటే విశాఖ క్రైం బ్రాంచ్ ఈ కేసు విచారణను చేపట్టింది. కేసు దర్యాప్తులో ఉందని, తమకు కొన్ని ఆధారాలు లభించాయని తీర ప్రాంత పోలీసు వర్గాలు తెలిపాయి. రిటైర్డ్(AGM) విశాఖపట్నంలోని బ్యాంకులోని కొంతమంది అంతర్గత వ్యక్తుల ప్రమేయం ఉందని సందేహం వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ తర్వాత అతను పొందిన ఖచ్చితమైన మొత్తంతో సహా తన ఖాతా గురించి అంతా ముఠాకు ఎలా తెలుసు. సమీపంలో ఉన్న హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కి వెళ్లి చెక్కును డ్రాప్ చేయమని ముఠా నాకు చెప్పింది" అని మాజీ AGM ఎన్‌డిటివికి చెప్పారు.
విశాఖ HDFC సిబ్బంది పాత్రపై అనుమానాలు
విశాఖపట్నంలోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ బ్రాంచ్ నుండి క్రైమ్ బ్రాంచ్ అనేక పత్రాలను తీసుకుందని వివరించారు. అయితే బ్యాంక్ అధికారులను తాను కలిసినప్పుడు కేసు పురోగతిపై స్పందించకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. "HDFC బ్యాంక్ వారు క్రైమ్ బ్రాంచ్‌కు సహకరిస్తున్నారని చెప్పారు. ఉత్తమ్ నగర్ (ఢిల్లీ) బ్రాంచ్ ద్వారా రాణా గార్మెంట్స్ కోసం మీ కస్టమర్ గురించి తెలియకుండా ఎలా నగదు బదిలీ చేశారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీలోని పోలీసులు రాణా గార్మెంట్స్‌కి వెళ్లి చూడగా మరో కంపెనీ వున్నట్లు గుర్తించారన్నారు. కాగా రాణా గార్మెంట్స్ యజమాని ఆచూకీ తెలియలేదని రిటైర్డ్ అధికారి తెలిపారు.
అసలు ఎలా మోసం చేశారంటే
FIR ప్రకారం,మాజీ AGM రిటైర్మెంట్ తాలూకు మొత్తం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఖాతాలో జమ అయిన తర్వాత, ఆయనకి ఓ ఫోన్ కాల్ వచ్చింది. తనను తాను "డిసిపి సైబర్ క్రైమ్ బాల్సింగ్ రాజ్‌పుత్"గా కాల్ చేసిన వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. పలు మాదకద్రవ్యాలు,మనీలాండరింగ్ కేసుల్లో తన పేరు వచ్చిందని,ఈ కేసులన్నింటికీ తన ఆధార్ లింక్ చేశారని ఆయనను బెదిరించారు. నకిలీ డిసిపి తన సీనియర్‌గా నటిస్తున్న మరొక వ్యక్తికి డయల్ చేసి, రిటైర్డ్ వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలా అని అడిగాడని మాజీ AGM చెప్పుకొచ్చారు. దీనితో తాను విపరీతమైన ఒత్తిడికి లోనయ్యానని చెప్పారు., నన్ను అక్కడి జైలుకు పంపుతానని బెదిరించారుని తెలిపారు.