LOADING...
Sajjanar: సీపీ సజ్జనార్‌ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌.. జాగ్రత్తగా ఉండండి : సజ్జనార్ 
సీపీ సజ్జనార్‌ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌.. జాగ్రత్తగా ఉండండి : సజ్జనార్

Sajjanar: సీపీ సజ్జనార్‌ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌.. జాగ్రత్తగా ఉండండి : సజ్జనార్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 15, 2025
12:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్‌బుక్ ఖాతా సృష్టించినట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. తన పేరును దుర్వినియోగం చేస్తూ 'ఆపదలో ఉన్నాను... డబ్బులు పంపండి' అంటూ మోసపూరిత మెసేజ్‌లను పంపిస్తున్నారని తెలిపారు. ఈ నకిలీ ఖాతాను నిజమైనదిగా నమ్మి ఇప్పటికే ఒక స్నేహితుడు రూ.20 వేలు పంపి మోసపోయినట్లు సజ్జనార్‌ చెప్పారు.

Details

పోలీసులకు సమాచారం ఇవ్వాలి

డబ్బులు అడుగుతూ వచ్చే ఇలాంటి సందేశాలను ఎవరూ విశ్వసించవద్దని హెచ్చరిస్తూ, అనుమానాస్పద లింకులు, మెసేజ్‌లు, వీడియో కాల్స్‌ వంటి వాటిని వెంటనే బ్లాక్‌ చేయాలని సూచించారు. నకిలీ ఖాతాలను, మోసపూరిత సైట్లను రిపోర్ట్‌ చేసి పోలీసులకు సమాచారమివ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సైబర్‌ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌‌కు కాల్‌ చేయాలని లేదా [www.cybercrime.gov.in](http://www.cybercrime.gov.in) వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సజ్జనార్‌ ప్రజలకు సూచించారు.