Ballots in Elections: ఈవీఎంలపై తప్పుడు ఆరోపణలు సహించం.. సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎన్నికల్లో బ్యాలెట్ విధానాన్ని తిరిగి తీసుకురావాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈవీఎంల రద్దు చేసి, పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కేఎల్ పాల్ కోరిన విషయం తెలిసిందే. విదేశాలలో ఇప్పటికీ బ్యాలెట్ విధానం అమలులో ఉందని, భారత్ కూడా అదే విధానం అనుసరించాలని ఆయన కోరారు. ఎన్నికల సమయంలో అవినీతి రూ.వేల కోట్లకు చేరుకుంటుందని ఆరోపించారు. ఈ అంశంపై ధర్మాసనం స్పందించింది.
ఆరోపణలకు తగిన ఆధారాలు లేవు
గెలిస్తే ఈవీఎంలు సక్రమంగా పని చేశాయ్ అంటారని, ఓడిపోతే ట్యాంపరింగ్ జరిగినట్లు ఆరోపిస్తారా అంటూ వ్యాఖ్యానించింది. బ్యాలెట్ విధానం అమలు చేస్తే అవినీతి పూర్తిగా ఆగిపోతుందని ఎలాంటి హామీ ఉంది? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ వాదనల్లో మెరుగైన ఆధారాలు లేకపోవడంతో పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కేఏ పాల్ వంటి వ్యక్తుల పిటిషన్‌లు పలు రాజకీయ పార్టీల్లో బ్యాలెట్ విధానంపై చర్చలకు దారితీసే అవకాశం ఉంది.