
Kanpur: కాన్పూర్'లో ఆరు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.కాన్పూర్ నగరంలోని చమన్‌గంజ్ ప్రాంతంలో ఉన్న ఆరు అంతస్తుల లెదర్ ఫ్యాక్టరీలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది.
ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు సజీవదహనమైయ్యారని పోలీసులు తెలిపారు.
మరణించిన వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్లు వెల్లడించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. సురక్షితంగా ఉండేందుకు సమీపంలోని ఇతర భవనాలను ఖాళీ చేయించారు.
వివరాలు
ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్
12 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను కట్టడిచేసారు.
గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో పోలీసులు అక్రమంగా షూ తయారీ యూనిట్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
ఈ అగ్నిప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు.
అగ్నిప్రమాదంలో చనిపోయిన ఐదుగురు వ్యక్తులు ఒకే కుటుంబానికి చెందిన వారు.
ఈ ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని కాన్పూర్ డీసీపీ దినేష్ త్రిపాఠి వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కాన్పూర్'లో ఆరు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం
#WATCH | Kanpur, UP | Fire broke out in a six-storey building in the Chaman Ganj area of the city. Efforts to douse the fire are underway. More details are awaited. pic.twitter.com/IY56UBqhtY
— ANI (@ANI) May 4, 2025