
16 వేలకు పైగా గుండెలను కాపాడిన డాక్టర్.. గుండెపోటుతో మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఆ డాక్టర్ వైద్యం చేస్తే ఎలాంటి ఆపదలో ఉన్న గుండె అయినా కొట్టుకుంటుంది. అలా దాదాపు 16 వేలకుపైగా గుండెల్ని కాపాడిన ఓ కార్డియాలజిస్ట్ అదే గుండెపోటుతో మరణించడం పట్ల విచారం వ్యక్తమవుతోంది.
41 ఏళ్ల చిన్న వయసులోనే సదరు కార్డియాలజిస్ట్ చనిపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఈ ఘటన గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగింది.
ప్రముఖ గుండె వైద్య నిఫుణుడిగా ఎంతో ఖ్యాతి గాంచిన గౌరవ్ గాంధీ ఎంతో కీర్తి సంపాదించాడు. రోజు మాదిరిగానే ఆస్పత్రిలో రోగులను చూసిన ఆయన సోమవారం రాత్రి ప్యాలెస్ రోడ్‌లోని తన నివాసానికి వెళ్లారు.
అనంతరం భోజనం చేసి నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయానికే ఆయన గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారణ అయ్యింది.
Famous Cardiologist Gaurav Gandhi Died Due To Cardiac Arrest
ముందు రోజు రాత్రి ఎలాంటి సమస్య లేదు : ఫ్యామిలీ
కార్డియాలజిస్ట్ గౌరవ్ గాంధీకి సోమవారం రాత్రి ఎలాంటి అసౌకర్యం లేదని కుటుంబీకులు తెలిపారు. చాలా ఆరోగ్యంగా ఉన్న ఆయన ఆ రాత్రి ఎలాంటి అనారోగ్య సమస్యలను చెప్పలేదన్నారు.
సాధారణంగా ఉదయం 6 గంటలకే నిద్ర లేచే గౌరవ్ ఆ సమయానికి మేల్కోలేదన్నారు. దీంతో నిద్ర నుంచి లేపేందుకు ప్రయత్నించామన్నారు.
తమ పిలుపునకు స్పందించకపోవడంతో హుటాహుటిన ఆయన్ను ఆస్పత్రికి తరలించామన్నారు. అప్పటికే గుండెపొటుతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారన్నారు.
మరోవైపు సుమారు 16 వేలకుపైగా గుండె ఆపరేషన్లు చేసి ఎందరో రోగుల ప్రాణాలను కాపాడిన గొప్ప హస్తవాసి ఉన్న ఈ కార్డియాలజిస్ట్ గౌరవ్ గాంధీ, చిన్నవయసులోనే గుండెపోటుతో చనిపోవడం పట్ల ఫ్యామిలీతో పాటు తోటి వైద్యులు తేరుకోలేకపోతున్నారు.