NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసనకు రైతు నాయకుల మద్దతు 
    తదుపరి వార్తా కథనం
    జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసనకు రైతు నాయకుల మద్దతు 
    జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసనకు రైతు నాయకుల మద్దతు

    జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసనకు రైతు నాయకుల మద్దతు 

    వ్రాసిన వారు Stalin
    May 07, 2023
    02:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ మహిళా అథ్లెట్లను లైంగికంగా వేధిస్తున్నారంటూ, ఆయన్ను అరెస్టు చేయాలంటూ రెజ్లర్లు దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొన్నిరోజులుగా ఆందోళన చేస్తున్నారు.

    వారికి రోజురోజుకు మద్దతు పెరిగిపోతోంది. తాజాగా రాకేష్ టికాయిత్ సహా పలువురు రైతు నాయకులు జంతర్ మంతర్ వద్ద తమ మద్దతుదారులతో కలిసి రెజ్లర్లకు మద్దతు తెలిపారు.

    దర్శన్ పాల్, హనన్ మొల్లా వంటి ఇతర రైతు నాయకులు కూడా రెజ్లర్లకు మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు.

    పంజాబ్, హర్యానా, దిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన పలువురు సీనియర్ నాయకులు వందలాది మంది రైతులతో జంతర్ మంతర్‌ను సందర్శిస్తారని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) తెలిపింది

    దిల్లీ

    రెజ్లర్లకు న్యాయం జరిగే వరకు నిరసన: రైతు నాయకులు

    ఈ పిల్లలకు (నిరసనలో ఉన్న రెజ్లర్లకు) న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగుతుందని ఖాప్ ప్రెసిడెంట్ పాలం చౌదరి సురేందర్ సోలంకి స్పష్టం చేశారు.

    నిరసనను ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది ఈ రోజు నిర్ణయించుకుందామని పేర్కొన్నారు. అంతకుముందు రోజు, రెజ్లర్ల నిరసనలో పాల్గొనడానికి రైతు సంఘాల నాయకులు దేశ రాజధానికి చేరుకున్నారు.

    రెజ్లర్లు ధర్నా చేస్తున్న నిరసన శిబిరం వద్దకు సరిహద్దు ప్రాంతాలలో వందలాది మంది రైతులు ఆదివారం నిరసన ప్రదేశాన్ని సందర్శించి వారికి మద్దతునిస్తారని అంచనా నేపథ్యంలో దిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

    దిల్లీలోకి ప్రవేశించే వాహనాలను తనిఖీ చేశారు. దిల్లీ -ఘాజీపూర్, తిక్రీ -సింగు సరిహద్దుల్లో పికెట్లు పెంచారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రెజ్లింగ్
    దిల్లీ
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    రెజ్లింగ్

    అనురాగ్ ఠాకూర్‌తో భారత రెజ్లర్ల సమావేశం, డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడి రాజీనామాకు డిమాండ్ అనురాగ్ సింగ్ ఠాకూర్
    డబ్ల్యూఎఫ్‌ఐ వివాదం: విచారణ పూర్తయ్యే వరకు బ్రిజ్ భూషణ్ పదవిలో ఉండరు: అనురాగ్ ఠాకూర్ అనురాగ్ సింగ్ ఠాకూర్
    రెజర్ల ఆందోళనపై ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు సుప్రీంకోర్టు
    ప్రాథమిక దర్యాప్తు తర్వాత బ్రిజ్ భూషణ్ పై కేసు నమోదు చేస్తాం  సుప్రీంకోర్టు

    దిల్లీ

    దిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధాని; రక్షణ, వాణిజ్యంపై మోదీతో కీలక చర్చలు జపాన్
    భారత్‌లోని విదేశీ రాయబారులకు కేంద్రమంత్రి హోదా; ఇతర దేశాల్లో మన హైకమిషన్లపై ఎందుకంత నిర్లక్ష్యం! భారతదేశం
    దిల్లీ మద్యం కేసు: నేడు మరోసారి ఈడీ ముందుకు కవిత; అరెస్టుపై ఊహాగానాలు కల్వకుంట్ల కవిత
    దిల్లీ మద్యం కేసు: అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత; అధికారులకు లేఖ కల్వకుంట్ల కవిత

    తాజా వార్తలు

    దిల్లీలో భారీ వర్షాలు: 13ఏళ్లలో రెండో కూలెస్ట్ డేగా రికార్డు దిల్లీ
    దిల్లీ మద్యం పాలసీ కేసు: ఛార్జిషీట్‌లో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పేరును చేర్చిన ఈడీ  దిల్లీ
    కాళీ దేవతపై ఉక్రెయిన్ అనుచిత ట్వీట్; భారతీయులకు క్షమాపణలు చెప్పిన ఆ దేశ మంత్రి  ఉక్రెయిన్
    భూమిని తాకిన అయస్కాంత తుఫాను; లద్దాఖ్‌లో అబ్బురపరిచిన అరోరా దృశ్యాలు లద్దాఖ్

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    Uttar Pradesh: గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌ శరీరంలో 9 బుల్లెట్లు  ఉత్తర్‌ప్రదేశ్
    జులై 1నుంచి అమర్‌నాథ్ యాత్ర; నేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం  జమ్ముకశ్మీర్
    భద్రతా కారణాలతో అతిక్ అహ్మద్ హంతకులను ప్రతాప్‌గఢ్ జిల్లా జైలుకు తరలింపు ఉత్తర్‌ప్రదేశ్
    హర్యానా: రైస్‌మిల్లు కుప్పకూలి నలుగురు మృతి; 20మందికి గాయాలు హర్యానా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025