Page Loader
Farmers Protest 200 Days: ఇవాళ సరిహద్దులో రైతుల భారీ నిరసన.. హాజరు కానున్న వినేష్ ఫోగట్
ఇవాళ సరిహద్దులో రైతుల భారీ నిరసన.. హాజరు కానున్న వినేష్ ఫోగట్

Farmers Protest 200 Days: ఇవాళ సరిహద్దులో రైతుల భారీ నిరసన.. హాజరు కానున్న వినేష్ ఫోగట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 31, 2024
11:53 am

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో శంభు, ఖానౌరీ వద్ద రైతుల ఉద్యమం నేటితో 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వేలాది మంది రైతులు ఈ సరిహద్దు ప్రాంతాలకు చేరుకుంటున్నారు. రెజ్లర్ వినేష్ ఫోగట్ కూడా ఈ నిరసన కార్యక్రమానికి హాజరుకానున్నట్లు తెలిసింది. ఖనౌరీ, శంభు, రతన్‌పురా సరిహద్దుల్లో జరుగుతున్న ఈ ఉద్యమంలో ఆమె పాల్గొనబోతున్నట్లు రైతు సంఘాలు స్పష్టం చేశాయి. రైతు నాయకులు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. మొదట తమని ఖలిస్తానీలు అని పిలిచేవారని, కానీ ఆ యత్నం ప్రస్తుతం విఫలమైందని వారు చెప్పారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఈ ఉద్యమం ఆగదని మరోసారి హెచ్చరించారు.

Details

కంగనా రనౌత్ పై కఠిన చర్యలు తీసుకోవాలి

రైతు నాయకుల ఉద్యమానికి విశేష ప్రాధాన్యం ఉందని తెలిపారు. లక్షలాది మంది ఈ ఉద్యమానికి మద్దతుగా తరలివస్తున్నారని, తమ డిమాండ్లను మరోసారి ప్రభుత్వానికి వినిపిస్తామని ప్రకటించారు. రాబోయే హర్యానా ఎన్నికలకు సంబంధించి తమ వ్యూహాన్ని త్వరలో వెల్లడిస్తామన్నారు. ఇదిలా ఉండగా బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. గతంలో కంగనా చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే.